Mahesh – Trivikram: మహేశ్ – త్రివిక్రమ్ సినిమాపై కొత్త డౌట్స్…కారణమిదేనా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mahesh – Trivikram: మహేశ్ – త్రివిక్రమ్ సినిమాపై కొత్త డౌట్స్…కారణమిదేనా..?

Mahesh – Trivikram: సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలొచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన సక్సెస్ సాధించలేదు. అయితే, మహేశ్ బాబును త్రివిక్రమ్ స్క్రీన్ మీద చూపించిన దానికి అభిమానులే కాదు అందరూ ఫిదా అయ్యారు. ఇక మహేశ్ బాబుకు కూడా త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ కథ, కథనం తయారు చేసే […]

 Authored By govind | The Telugu News | Updated on :5 May 2022,2:00 pm

Mahesh – Trivikram: సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలొచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన సక్సెస్ సాధించలేదు. అయితే, మహేశ్ బాబును త్రివిక్రమ్ స్క్రీన్ మీద చూపించిన దానికి అభిమానులే కాదు అందరూ ఫిదా అయ్యారు. ఇక మహేశ్ బాబుకు కూడా త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ కథ, కథనం తయారు చేసే విధానం బాగా నచ్చాయి.

అందుకే, ముందు రెండు చిత్రాల ఫలితం కాస్త తేడాగా వచ్చినా కూడా మూడవ సినిమా అవకాశం ఇచ్చాడు. సాధారణంగా మహేశ్ ఫ్లాపుల్లో ఉన్న దర్శకులను దగ్గరికి రానివ్వడనే టాక్ ఉంది. అంతేకాదు, తనకు ఫ్లాపు ఇచ్చిన దర్శకుడికు కూడా అంత త్వరగా మరోసారి ఛాన్స్ ఇవ్వడని చెప్పుకుంటుంటారు. ఆ రకంగా చూస్తే మాత్రం త్రివిక్రమ్ లక్కీ అని చెప్పాలి. వాస్తవంగా త్రివిక్రమ్ ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు కమిటయ్యాడు. కానీ, అనుకోని కారణాల వల్ల తారక్ ప్రాజెక్ట్ వదిలేసి మహేశ్ బాబుతో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు.

new doubts on mahesh trivikram movie

new doubts on mahesh-trivikram movie

Mahesh – Trivikram: మహేశ్ కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటాడా..?

ఇది కూడా అనుకున్నంత పక్కాగా స్క్రిప్ట్ విషయంలో అడుగులు ముందుకు పడటం లేదనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ మూవీకి త్రివిక్రమ్ రచనతో సహా ప్రాజెక్ట్‌కు ఏం కావాలో అవన్నీ చూసుకున్నాడు. ఈ సినిమా భారీ హిట్ సాధించింది. దాంతో వరుసగా మరో మూడు రీమేక్ సినిమాల బాధ్యతను పవన్ త్రివిక్రమ్ కి అప్పగించారట. వాటి పనుల్లో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. మహేశ్‌తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్‌ను ఇంకా కంప్లీట్ చేయలేదని సమాచారం. జూన్ లేదా జూలై నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇప్పటివరకు త్రివిక్రమ్..ఫుల్ స్క్రిప్ట్ మహేశ్‌కు నరేట్ చేయలేదట. దాంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా లేటవుతుందా లేదా మరో దర్శకుడితో మహేశ్ కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటాడా అని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చలు సాగుతున్నాయి.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది