
OnePlus 10R 5G launched in india with 150W SuperVOOC Charge
OnePlus 10R 5G : మార్కెట్ లో డిమాండ్ ను బట్టి ప్రముఖ మొబైల్ కంపెనీలు పోటీపడుతూ కొత్త ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ తో తక్కువ రేంజ్ లో స్పీడ్ చార్జ్ తో అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రముఖ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ సరికొత్త ఫీచర్స్ తో మరో ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ రోజు నుంచే ఈ మొబైల్స్ సేల్స్ ప్రారంభించింది. రెండు కలర్స్ గ్రీన్, బ్లాక్ లో ఈ మొబైల్ వన్ ప్లస్ అధికారిక స్టోర్, అమెజాన్ వంటి స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.స్క్రీన్ 6.7 ఇంచెస్ తో ఫుల్ ఎచ్డీ , ఆమోలెడ్ డిస్‌ప్లేను అందిస్తోంది. 120 ఎచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 720 ఎచ్ జెడ్ టచ్ రెస్పాన్స్ రేట్, 2.5డీ కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 8100- మాక్స్ ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 12 తో కూడిన ఆక్సిజన్ ఓఎస్ 12.1తో ఈ మొబైల్ లాంచ్ అయింది. టెంపరేచర్ కంట్రోల్‌లో ఉండేలా పాసివ్ కూలింగ్ టెక్నాలజీ ఈ మొబైల్‌లో ఉంది. 4500 ఎంఏఎచ్ బ్యాటరీతో 150వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్‌తో పాటు 80వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ చార్జింగ్ మోడల్ కూడా విడుదలైంది. గేమింగ్ బెస్ట్‌గా ఉండేలా కూలింగ్ సిస్టమ్, హైపర్‌బూస్ట్ ఇంజిన్ కూడా ఉన్నాయి. అలాగే స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం హైపర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్, జనరల్ పర్ఫార్మెన్స్ అడాప్టర్ ఫీచర్లను ఈ మొబైల్ కలిగి ఉంది.80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న వన్‌ప్లస్ 10ఆర్ 5జీ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ ధర రూ.42,999గా ఉంది.
OnePlus 10R 5G launched in india with 150W SuperVOOC Charge
ఇక 150వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న వన్ ప్లస్ 10ఆర్ ఎన్డ్యూరెన్స్ ఎడిషన్ 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.43,999గా వన్‌ప్లస్ నిర్ణయించింది. ఈ రోజు 12 గంటల నుంచే అమెజాన్, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్, రిలయన్స్ డిజిటల్, క్రోమాతో పాటు ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో సేలింగ్ ప్రారంభమైంది. కొటాక్, ఐసీఐసీఐ బ్యాంక్స్ తో క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 2000 తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.అలాగే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, నాయిస్ క్యాన్సలేషన్ సపోర్ట్ కూడా అవైలేబుల్ లో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి. ఇక ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.