Jabardast : జబర్దస్త్ ప్రారంభం అయ్యి పది వసంతాలు కాబోతుంది. ఇప్పటికి జబర్దస్త్ అంటే తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ప్రతి ఒక్కరు గుర్తు పట్టేంతగా పాపులర్ అయ్యింది.. కొనసాగుతూనే ఉంది. ఏదైనా సక్సెస్ షో లో చిన్న మార్పు చేస్తే చాలా పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయకుండా సక్సెస్ షోను అలాగే నడుపుతూ ఉంటారు. బాగా నడుస్తున్న షో ను కెలకడం ఎందుకు అని అంతా అనుకుంటూ ఉంటారు. కాని జబర్దస్త్ ఎంత సక్సెస్ అయినా కూడా దానిలో మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి.. ఎంతో మంది వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు.
జబర్దస్త్ లో రెండు మూడు వారాలు అనసూయ కనిపించక పోవడంతో ఆమె ఔట్ అంటూ వార్తలు వచ్చాయి. సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్న కారణంగా ఆమె స్వయంగా తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆమె తప్పుకోలేదు.. కేవలం బ్రేక్ ఇచ్చింది అంటూ తాజాగా రీ ఎంట్రీ తో క్లారిటీ వచ్చింది. రష్మి మళ్లీ ఎక్స్‌ట్రా కు వెళ్లి పోయింది. తాజాగా జబర్దస్త్ కొత్త లుక్ అంటూ అనసూయ ప్రకటించి ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వారంలో అంటే రేపు టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కాస్త ఆసక్తికరంగా ఉంది. ఎప్పటిలాగే ఆది టీమ్ లో గెస్ట్ గా సుధీర్ వచ్చాడు. అదిరే అభి స్కిట్ ఎగిరి పోయింది.
ఆ స్థానంలో కొత్తగా ఢీ షో కు చెందిన డాన్సర్స్ తో కొత్త టీమ్ వచ్చింది. పండు గాడు కొత్త టీమ్ తో ఎంట్రీ ఇచ్చాడు. పండు జబర్దస్త్ లో సందడి చేయడం కొత్తేం కాదు. శ్రీ దేవి డ్రామా కంపెనీలో కూడా అతడి కామెడీ మరియు డాన్స్ ఆకట్టుకుంటున్నాయి. అందుకే జబర్దస్త్ లో ఏకంగా పండు గాడు టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఢీ లో కామెడీ చేయడం జరుగుతుంది.. అందుకే ఢీ అంత సూపర్ హిట్ అయ్యింది. కనుక జబర్దస్త్ లో కూడా ఢీ డాన్సర్స్ తో కామెడీ చేయిస్తుంటే మంచి స్పందన వస్తుంది. అందుకే ఏకంగా ఒక టీమ్ నే ఇవ్వడం జరిగింది. దానికి పండుగాడు టీమ్ లీడర్ గా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.
రేపటి ఎపిసోడ్ లో ఆ విషయమై మరింత స్పష్టత వస్తుందని అంతా భావిస్తున్నాడు. ఢీ లో మరియు జబర్దస్త్ లో కామెడీ మరియు డాన్స్ ను అదరగొట్టిన కొందరిని ఈ కొత్త టీమ్ లో వేశారు. పండు చేసే కామెడీ పంచులకు జడ్జ్ లు మాత్రమే నవ్వుతారా లేదంటే ప్రేక్షకులు అంతా కూడా నవ్వుతారా అనేది చూడాలి. ఈ కొత్త టీమ్ రాక తో మళ్లీ జబర్దస్త్ సందడి హడావుడి పీక్స్ కు వెళ్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.