Jabardast : ఈ మార్పు గమనించారా.. ఢీ లో కామెడి, జబర్దస్త్‌లో డాన్స్‌ విడ్డూరం!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jabardast : ఈ మార్పు గమనించారా.. ఢీ లో కామెడి, జబర్దస్త్‌లో డాన్స్‌ విడ్డూరం!!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 January 2022,6:30 pm

Jabardast : జబర్దస్త్‌ ప్రారంభం అయ్యి పది వసంతాలు కాబోతుంది. ఇప్పటికి జబర్దస్త్‌ అంటే తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ప్రతి ఒక్కరు గుర్తు పట్టేంతగా పాపులర్ అయ్యింది.. కొనసాగుతూనే ఉంది. ఏదైనా సక్సెస్‌ షో లో చిన్న మార్పు చేస్తే చాలా పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయకుండా సక్సెస్‌ షోను అలాగే నడుపుతూ ఉంటారు. బాగా నడుస్తున్న షో ను కెలకడం ఎందుకు అని అంతా అనుకుంటూ ఉంటారు. కాని జబర్దస్త్ ఎంత సక్సెస్‌ అయినా కూడా దానిలో మార్పులు చేర్పులు వస్తూనే ఉంటాయి.. పోతూనే ఉంటాయి.. ఎంతో మంది వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు.

జబర్దస్త్‌ లో రెండు మూడు వారాలు అనసూయ కనిపించక పోవడంతో ఆమె ఔట్ అంటూ వార్తలు వచ్చాయి. సినిమాల్లో వరుస ఆఫర్లు వస్తున్న కారణంగా ఆమె స్వయంగా తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆమె తప్పుకోలేదు.. కేవలం బ్రేక్ ఇచ్చింది అంటూ తాజాగా రీ ఎంట్రీ తో క్లారిటీ వచ్చింది. రష్మి మళ్లీ ఎక్స్‌ట్రా కు వెళ్లి పోయింది. తాజాగా జబర్దస్త్‌ కొత్త లుక్ అంటూ అనసూయ ప్రకటించి ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వారంలో అంటే రేపు టెలికాస్ట్‌ కాబోతున్న ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో కాస్త ఆసక్తికరంగా ఉంది. ఎప్పటిలాగే ఆది టీమ్‌ లో గెస్ట్‌ గా సుధీర్ వచ్చాడు. అదిరే అభి స్కిట్‌ ఎగిరి పోయింది.

new team in jabardast and anasuya re entry as anchor

new team in jabardast and anasuya re entry as anchor

Jabardast : ఢీ పండు టీమ్‌ జబర్దస్త్‌ లో కామెడీ

ఆ స్థానంలో కొత్తగా ఢీ షో కు చెందిన డాన్సర్స్ తో కొత్త టీమ్‌ వచ్చింది. పండు గాడు కొత్త టీమ్ తో ఎంట్రీ ఇచ్చాడు. పండు జబర్దస్త్‌ లో సందడి చేయడం కొత్తేం కాదు. శ్రీ దేవి డ్రామా కంపెనీలో కూడా అతడి కామెడీ మరియు డాన్స్ ఆకట్టుకుంటున్నాయి. అందుకే జబర్దస్త్‌ లో ఏకంగా పండు గాడు టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఢీ లో కామెడీ చేయడం జరుగుతుంది.. అందుకే ఢీ అంత సూపర్‌ హిట్ అయ్యింది. కనుక జబర్దస్త్‌ లో కూడా ఢీ డాన్సర్స్ తో కామెడీ చేయిస్తుంటే మంచి స్పందన వస్తుంది. అందుకే ఏకంగా ఒక టీమ్ నే ఇవ్వడం జరిగింది. దానికి పండుగాడు టీమ్ లీడర్ గా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

రేపటి ఎపిసోడ్ లో ఆ విషయమై మరింత స్పష్టత వస్తుందని అంతా భావిస్తున్నాడు. ఢీ లో మరియు జబర్దస్త్‌ లో కామెడీ మరియు డాన్స్ ను అదరగొట్టిన కొందరిని ఈ కొత్త టీమ్‌ లో వేశారు. పండు చేసే కామెడీ పంచులకు జడ్జ్ లు మాత్రమే నవ్వుతారా లేదంటే ప్రేక్షకులు అంతా కూడా నవ్వుతారా అనేది చూడాలి. ఈ కొత్త టీమ్‌ రాక తో మళ్లీ జబర్దస్త్‌ సందడి హడావుడి పీక్స్ కు వెళ్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది