Nidhhi Agerwal : అదంటే చచ్చేంత ప్రాణమున్నట్టుంది.. నిధి అగర్వాల్‌కు ఇష్టమైంది అదే!
Nidhhi Agerwal : కొందరు హీరోయిన్లు ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇంకొందరు మాత్రం మితంగానే తింటారు. మరి కొందరు ఎంత తిన్నా కూడా వర్కవుట్లతో బ్యాలెన్స్ చేస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అలా హీరోయిన్లు ఫిట్ నెస్ మెయింటైన్ చేసేందుకు చాలా తంటాలే పడుతుంటారు. ఆరోగ్య పద్దతులు, వారి జీవన శైలిలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలా నిధి అగర్వాల్ తనకు ఇష్టమైన ఫుడ్, బ్రేక్ ఫాస్ట్ గురించి ఎక్కువగా చెబుతూ ఉంటుంది.

Nidhhi Agerwal about her favourite food
ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం సోషల్ మీడియాకు క్వీన్ వంటిది. ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు అందరినీ కట్టిపడేస్తుంటాయి. ఆమె ఒకసారి ఎద అందాలతో వల వేస్తే నెట్టిళ్లు మొత్తం మంటలు వ్యాపించాల్సిందే. నిధి అందాలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. అందుకే సినిమాల సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నిధి క్రేజ్ మాత్రం పెరుగుతూనే వస్తోంది. నిధి అగర్వాల్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మరీ ఎక్కువగా ఉంటుంది. ఆమె సైతం తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండేందుకే ఇష్టపడుతుంది.
నిధి అగర్వాల్‌కు ఇష్టమైంది అదే..Nidhhi Agerwal
అలాంటి నిధి అగర్వాల్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఓ అభిమాని నిధి మాట్లాడిన మాటలన్నీ ఓ వీడియోగా ఎడిట్ చేశాడు. అందులో నిధి తనకు ఇష్టమైన ఫుడ్, బ్రేక్ ఫాస్ట్ గురించి చెప్పింది. ప్రతీ ఇంటర్వ్యూలోనూ నిధి ఇడ్లీ గురించే మాట్లాడింది. ఇడ్లీ అంటే ఎంతో ఇష్టమని, ప్రాణమన్నట్టుగా తెలిపింది. అందుకే నిధి కూడా ఇడ్లీలా సాఫ్ట్‌గా ఉంటుందేమో అని నెటిజన్లు కొంటె కామెంట్లు పెడుతున్నారు. నిధి అగర్వాల్ ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో సత్తా చాటింది. ఈశ్వరన్, భూమి అనే రెండు చిత్రాలతో అక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది.