
niharika arrested by police
Niharika : కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వాడకం భారీగా పెరుగుతోన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అందుకు అనుగుణంగానే ఇటీవలే దీనికి బానిసైన ఓ వ్యక్తి ప్రాణాలను కూడా కోల్పోయాడు. దీంతో నగర పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే నియమ నిబంధనలు పాటించని పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో మరో భారీ రేవ్ పార్టీని భగ్నం చేశారు. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి యజమానితో సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిలో బిగ్‌బాస్ విన్నర్, టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండటంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పబ్‌లో నిర్వహించిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీలో అనేక మంది యువతులు కూడా పాల్గొన్నారు. అయితే నిహారిక కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టు కొందరు చెబుతున్నారు. నిహారిక వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ పార్టీలో యువ హీరోతో పాటు పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు కూడా ఉన్నారని సమాచారం.పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం హంగామా సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది.
niharika arrested by police
ఇక ఈ దాడుల్లో రాహుల్ సింప్లిగంజ్, ఉప్పల్ అనిల్ కుమార్, నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ని అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది. నగరంలో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్‌ను తగ్గించే చర్యల్లో భాగంగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌పై గత రాత్రి దాడి చేసినట్లు తెలుస్తోంది. అందులో నిర్వహిస్తోన్న ఓ పబ్‌ను కూడా తనిఖీలు చేశారు. అప్పుడు దాన్ని నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే వాళ్లపై చర్యలు తీసుకున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.