Niharika Konidela : ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి’ చెప్పిన నిహారిక.. చిరంజీవిపై ఆసక్తికర కామెంట్స్..!
Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక బుల్లితెరపై యాంకర్‌గా పలు కార్యక్రామాల్లో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. చైతన్యను మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ తర్వాత కూడా సినీ రంగంలోనే కొనసాగుతోంది నిహారిక. వెబ్ సిరీస్‌పైన ఫోకస్ పెట్టిన నిహారిక. తాజాగా మరో సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.నిహారిక ప్రొడ్యూస్ చేసిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి’ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో తన టీమ్‌తో కలిసి నిహారిక పాల్గొంటోంది.
ఈ క్రమంలోనే యాంకర్స్ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించగా, నిహారిక సమాధానం చెప్పింది. తాను అడిగితే పెద్దనాన్న కాని, బాబాయ్ కాని నో చెప్పరని, కానీ, వారు బిజీగా ఉన్నందున తానే పిలవలేదని పేర్కొంది. ఇకపోతే తన పెద్దనాన్న చిరంజీవి వెబ్ సిరీస్‌ను చూశారని, తనకు బాగా నచ్చిందని చెప్పారని తెలిపింది నిహారిక.ఇకపోతే తాను చిరంజీవి గారిని ‘డాడీ’ అనే పిలుస్తానని నిహారిక తెలిపింది.
Niharika Konidela : తాను అడిగితే చిరంజీవి, పవన్ కల్యాణ్ నో చెప్పరన్న నిహారిక..
తన అన్నయ్య వరుణ్ అలానే పిలుస్తారని, అలా తనకు కూడా అలవాటైపోయిందని నిహారిక వివరించింది. మెగా ఫ్యామిలికీ సంబంధించిన ఓటీటీ ‘ఆహా’ ఉండగా.. ‘జీ5 ’ ఓటీటీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించగా, ఆహాకు ఇస్తే అయినవాళ్లు కాబట్టి ఇచ్చారని చెప్తూనే.. ఇంతకు మందుర తాను నిర్మించిన వెబ్ సిరీస్‌లు ‘ముద్దప్పు ఆవకాయ్, నాన్న కూచి’ జీ5లో స్ట్రీమ్ అయ్యాయని, అయితే..
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి’ కంటెంట్ విషయంలో వారి సూచనలు తీసుకున్నామని, అందువలన ఇది కూడా వాళ్లకే ఇచ్చామని తెలిపింది నిహారిక. ఇకపోతే తానేం చేసినా చెప్పే చేయాలని తన కుటుంబం తనకు హద్దులు గీయలేదని, తాను తగినంత స్వేచ్ఛతో బతుకుతున్నానని, తనకు తెలిసిన సినీ రంగంలో రాణించాలనుకుంటున్నానని చెప్పింది. సినిమా కోసం ఎంతలా కష్టపడతారో అదే మాదిరిగా తానూ వెబ్ సిరీస్ కోసం కష్టపడుతున్నానని తెలిపింది నిహారిక.