Niharika : నిహారిక విడాకుల విషయం వారికి ముందే తెలుసా.. ఇన్నాళ్లకి బయటపడ్డ సీక్రెట్..!
Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మొదట హోస్ట్‌గా అలరించిన నిహారిక ఆ తర్వాత నటిగా మారింది. అయితే ఆమె చేసిన ఒక్క సినిమా కూడా మంచి హిట్ కాకపోవడంతో చేసేదేం లేక జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుంది. అతనితో జీవితాంతం కలిసి ఉంటుందని అందరు భావించగా కొన్నాళ్లకే విడాకులు తీసుకొని సోలోగా ఉంటుంది. ఇప్పటి వరకు నిహారిక చైతన్య విడాకులకి కారణం ఏంటనేది బయటకు రాలేదు. కాకపోతే నిహారికదే తప్పు అని ఆమె వల్లనే విడాకులు అయి ఉంటాయని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఐ డోంట్ కేర్ అంటూ నిహారిక ముందుకు సాగుతుంది.
తాజాగా నిహారిక విడాకులకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. నిహారిక విడాకుల విషయం వారి కుటుంబ సభ్యులకి ముందే తెలుసంటూ వార్త సారాంశం. పెళ్లికి ముందే నిహారిక ,చైతన్యల జాతకం పండితులకి చూపించగా వారు ఇద్దరి జాతకాల్లో దోషం ఉందని, పరిహార శాంతి పూజలు చేయాల్సి ఉంటుందని నాగబాబుకి సూచించారట. కాని నిహారిక మొదటి నుండి ఇలాంటి వాటికి దూరం కాబట్టి పండితుల మాటలని పెద్దగా పట్టించుకోకుండా పెళ్లి చేసుకుందట. మరోవైపు నిహారిక, చైతన్యల పెళ్లి అనుకున్న ముహుర్తానికి కూడా జరగలేదట. పేర్ల మీద పెట్టిన ముహూర్తం దాటిపోయిన తరువాత నిహారిక, చైతన్యల పెళ్లి జరిగిందట.
ఫొటో షూట్స్, ఇతరత్రా కార్యక్రమాలతో టైం అంతా వేస్ట్ చేసి ముహూర్తం దాటి పోయిన తర్వాత నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేసాడని ఈ కారణం వల్లనే నిహారిక-చైతన్యల విడాకులు జరిగాయని ఇప్పుడు నెట్టింట పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నిహారిక- చైతన్యలు విడిపోయారు. వారు తిరిగి కలిసే అవకాశం లేదు. నిహారిక తిరిగి తన కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. ఆమె సినిమాలలో నటిస్తూనే నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళ భాషలలో కూడా నిహారిక నటిస్తుంది. ఇటీవల నిహారిక మనోజ్ నటించే ”వాట్ ది ఫిష్” అనే సినిమాలో నటిస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో అయిన నిహారిక సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.