
Divi Vadthya : రవితేజ వలన బాత్‌రూమ్‌లో నోరు మూసుకొని వెక్కి వెక్కి ఏడ్చా.. బిగ్ బాస్ బ్యూటీ దివి సంచలన కామెంట్స్
Divi Vadthya : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ షోతో వెలుగులోకి వచ్చిన అందాల భామ దివి. ఈ అమ్మడు మహర్షి సినిమాతో పాటు పలు సినిమాలలో కీలక పాత్రలు పోషించింది. అయితే బిగ్ బాస్ షో మాత్రమే ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. షోలో దివి తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్ధులని చేసింది. ఉన్నన్ని రోజులు దివి తన గ్లామర్‌తోనే సందడి చేసింది. షో నుండి బయటకు వచ్చాక దివి క్రేజ్ పెరిగింది. పలు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇక అప్పుడప్పుడు ఫొటో షూట్స్‌తో కూడా అదరగొడుతూ రచ్చ చేస్తుంది. దివి తాజాగా నటించిన చిత్రం లంబసింగి .
మార్చి 15న ఈ చిత్రం విడుదల కానుండగా, మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలలో దివి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. అయితే తన జీవితంలో ఘోరమైన అనుభం గురించి తాజాగా చెప్పిన దివి అందరు షాక్ అయ్యేలా చేసింది. దివి తాను మోడలింగ్ నుండి నటిగా మారినట్టు పేర్కొంది. అయితే తను ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినట్టు తెలియజేసింది. మొదట్లో చాలా మంది తనని రిజెక్ట్ చేశారని, చేతికి వచ్చిన చాలా అవకాశాలు చేజారాయని పేర్కొంది. ఏదో కారణం చెబుతూ నన్ను ఎంపిక చేసిన ప్రాజెక్ట్ నుండి తొలగించేవారని పేర్కొంది.
కొందరు నన్ను సన్నగా ఉన్నారని రిజెక్ట్ చేస్తే, మరి కొందరు లావుగా ఉన్నారని రిజెక్ట్ చేసేవాళ్లు. లావుగా ఉన్నారని అన్నందుకు కాస్త సన్నగా మారితే మరీ ఇంత సన్నగానా అని అనేవారు. ఓ సారి రవితేజ సినిమాలో నన్ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారు. హీరోయిన్ నువ్వే అని కూడా నాకు చెప్పారు. ఐదు రోజుల్లో షూటింగ్ మొదలు కానుందని అనే సమయంలో నన్ను తొలగించారు. ఫోన్ చేస్తాం అన్నారు. ఎలాంటి కాల్ రాలేదు. ఇక నన్ను తీసేసారని తెలిసి చాలా ఏడ్చేశాను. బాధ భరించలేక బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసుకుని తడుస్తూ వెక్కి వెక్కి ఏడ్చానంటూ దివి పేర్కొంది. అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతారేమోనని సౌండ్ రాకుండా లోపల లోపల ఏడ్చేదానిని అంటూ దివి తన బాధలు చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు మంచి హీరోయిన్‌గా ఎదగాలని అనుకుంటుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.