Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడుగురు హీరోలు కేవలం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం.ఇక మెగా కుటుంబం నుంచి నాగబాబు గారాల పట్టి నిహారిక కూడా ఆ మధ్యలో పలు సినిమాలు చేసింది. అందులో కొన్నిఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. నిహారిక కూడా వారసత్వాన్ని అడ్డుపెట్టుకోకుండా తన నటనకు ప్రియారిటీ ఇచ్చింది. నటిగా రాణించాలని చాలానేట్రై చేసింది. కానీ అనుకోకుండా పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది.
మెగాస్టార్ చిరు సినిమాల్లో బిజీగా ఉండగా..నాగబాబు మాత్రం ఎక్కువగా సినిమాల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు.అడపాదడపా సినిమాల్లో చేస్తూనే నిర్మాణ సంస్థను పెట్టి నడిపించారు మెగాబ్రదర్. ఆరెంజ్ సినిమాతో పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబు.. బుల్లితెరపై జబర్దస్త్ షోకు జడ్జిగా కూడా కొన్నాళ్లు వ్యవహరించారు. ఈటీవీ మేనెజ్మెంట్‌తో ఎక్కడ చెడిందేమో తెలీదు కానీ జీ తెలుగులో అదిరింది షోతో మళ్లీ జడ్జిగా అవతారం ఎత్తారు. ఇదే టైంలో రాజకీయంగా తమ్ముడికి సపోర్ట్ చేస్తూ జనసేన పార్టీ తరపున 2019 నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి లోక్ సభకు కూడా పోటీ చేశారు.నాగబాబు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటుంటారు.
ఈ మధ్య కాలంలో నాగబాబు మా చానెల్‌లో ప్రసారమయ్యే చాలా ఈవెంట్లలో కనిపిస్తున్నాడు.దీనికి కారణం మల్లెమాల ప్రొడక్షన్ తో నాగబాబుకు మనస్పర్ధలు రావడమే అని చాలా మందికి తెలుసు. అయితే, కూతురు నిహారిక మాత్రం తండ్రికి అసలు నచ్చని మల్లెమాల ప్రొడక్షన్‌లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. నాగబాబు మాత్రం ఎన్నో రోజులుగా మల్లెమాల సంస్థకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీనిహారిక మాత్రం తండ్రికి ఇష్టం లేని మల్లెమాల ప్రొడక్షన్‌లో జరిగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వెళ్లి తండ్రిని అవమానించిందని చాలా మంది అంటున్నారు. ఇక నిహారిక అక్కడికి వెళ్లడం చూసిన నెటిజన్లు తండ్రికి వెన్నుపోటు పొడిచిందని పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.