Niharika Konidela : భర్తతో విడిపోయాక నిహారిక కొణిదెల పోస్ట్ చేసిన మొట్టమొదటి ఫోటో ఇదే !
Niharika Konidela : బుల్లితెరపై ఇప్పటికి ప్రసారమవుతున్న డాన్స్ షోకి హోస్ట్ గా పరిచయమైన మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆ షోతో మంచి ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. దాని తర్వాత ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. కానీ ఊహించినంతగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో మెగా ఫ్యామిలీ ఆమెకు జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరికి పెళ్లి అయిన కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చైతన్య, నిహారిక విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు వస్తున్నాయి. అయినా వీటిపై మెగా ఫ్యామిలీ ఇంతవరకు స్పందించలేదు.
అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నిహారిక కొణిదెల కూడా తన విడాకుల గురించి వస్తున్న వార్తలను ఖండించలేదు. అంతేకాకుండా చైతన్య, నిహారిక తమ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒకరినొకరు పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. ఇద్దరు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీళ్ళిద్దరూ నిజంగా విడాకులు తీసుకుంటున్నారని జనాలు అనుకుంటున్నారు. అయితే తాజాగా నిహారిక సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉదా రంగు చీరలో, గిరజాల జుట్టుతో, ముక్కుకు ముక్కెర పెట్టుకొని నిహారిక ఎంతో ఒద్దికగా కనిపించింది. మెగా ప్రిన్సెస్ అందాన్ని చూసి అభిమానులు మైమరిచిపోతున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల నిహారిక ఎక్కువగా ఫోటోషూట్లను చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇలా ఫోటోషూట్ చేయడానికి కారణం నిహారిక మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ ఫోటో షూట్ లు చూస్తే నిజంగానే నిహారిక త్వరలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక తన పెళ్లి విడాకులపై వస్తున్న వార్తలను ఎందుకు ఖండించడం లేదు అని జనాలు ప్రశ్నిస్తున్నారు.