Home » Entertainment » Niharika Konidela Launches New Production House
Entertainment

Niharika Konidela : నిహారిక తన వీపు మీద వేసుకున్న టాటూను చూసి రాజశేఖర్ కూతుళ్లు షాక్.. ఇంతకీ ఏంటా టాటూ?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 11, 2023, 2:10 pm
Advertisement

Niharika Konidela : నిహారిక కొణిదెల తెలుసు కదా. మొన్నటి వరకు తన అన్న పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న నిహారిక.. తాజాగా కొత్త ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్ లో తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రొడక్షన్ హౌస్ లాంచ్ కి తనే చీఫ్ గెస్ట్ గా వెళ్లింది. మెగా ఫ్యామిలీ కూడా ఈ ఈవెంట్ కు వచ్చినా.. నిహారిక హడావుడే అక్కడ ఎక్కువగా ఉంది. కొత్తగా పెళ్లి అయిన వరుణ్ తేజ్, లావణ్య జంట కూడా అక్కడికి వచ్చారు. తన మరదలు కోసం అక్కడికి వచ్చి సందడి చేసింది లావణ్య త్రిపాఠి. ఇక వరుణ్ తేజ్ కూడా తన చెల్లి కోసం వచ్చాడు. నాగబాబు, అల్లు అరవింద్, సుశాంత్, రాజశేఖర్ కూతుళ్లు కూడా ఈ ఈవెంట్ కు వచ్చారు. ఈవెంట్ లో చీర కట్టుకొని అచ్చ తెలుగు అమ్మాయిలా మెరిసింది నిహారిక.

Advertisement

అయితే.. నిహారిక చీర కట్టుకోవడంతో తన వెనుక అంటే వీపు భాగంలో తను వేసుకున్న టాటూ అందరికీ కనిపించింది. తన టాటూ గురించి తెలిసిన వాళ్లు పెద్దగా పట్టించుకొని ఉండరు కానీ.. తన టాటూ గురించి తెలియని వాళ్లు మాత్రం నిహారిక టాటూ చూసి షాక్ అయ్యారు. వామ్మో.. ఇదేంటి ఇలా వేసుకుంది టాటూ అనుకున్నారు. రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరు కూడా తన టాటూ చూసి షాక్ అయ్యారు. ఒసేయ్.. ఏంటే ఆ టాటూ అన్నట్టుగా తన వైపు చూశారు.

Niharika Konidela : నిహారిక కొణిదెల టాటూ అప్పట్లో వైరల్

కొన్ని రోజుల కిందనే నిహారిక టాటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా.. కొందరు ప్రత్యక్షంగా తన టాటూ చూసి షాక్ అవుతున్నారు. తాజాగా తన చీర కట్టుకోవడంతో మళ్లీ ఆ టాటూ కనిపించింది. దీంతో ఆ టాటూ ఉన్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి తన టాటూ గురించి చర్చ నడుస్తోంది. కానీ.. తను వేయించుకున్న టాటూ మరేంటో కాదు.. సీతాకోకచిలుక టాటూ అది. అంతే.. అంతకు మించి ఇంకేం లేదు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి