Niharika konidela : యూట్యూబర్ తో రిలేషన్ లో ఉన్న నిహారిక .. ఆ ఒక్క పోస్ట్ తో క్లారిటీ ..!

Advertisement

Niharika konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. యాంకర్ గా కెరియర్ ప్రారంభించి చిన్నచిన్న వెబ్ సిరీస్ లు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇక తర్వాత నిహారిక యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి ‘ ఒక మనసు ‘ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ బ్యూటీ హీరోయిన్ గా అంతగా సినిమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తూ అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తూ నిర్మాతగా నిహారిక ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిగింది.

Advertisement

కానీ ఆ పెళ్లి మూణ్ణాల ముచ్చటగానే నిలిచిపోయింది. పెళ్లి అయిన కొద్ది కాలానికే విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఇప్పటినుంచి సోషల్ మీడియాలో నిహారిక విడాకులు విషయం ఎంత హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. దీనిపై నేటిజెన్లు నిహారికను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. మెగా ఫ్యామిలీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే నిహారిక విడాకులకు ఓ యూట్యూబర్ కారణం అంటూ వార్తలు వచ్చాయి. ఆ యూట్యూబర్ తో నిహారిక క్లోజ్ గా ఉండడం వలన నిహారిక భర్త తన మీద అనుమాన పడి విడాకులు ఇచ్చేసాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ పైన కూడా నెటిజన్స్ చాలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. నిహారిక యూట్యూబర్ కి మధ్య ఏదో రిలేషన్ షిప్ ఉందని వార్తలు వచ్చాయి.

Advertisement
Niharika konidela relationship with youtuber
Niharika konidela relationship with youtuber

అయితే యూట్యూబర్ తో తనపై వస్తున్న వార్తలకు నిహారిక ఒకే ఒక్క పోస్టుతో చెక్ పెట్టేసింది. ఆ యూట్యూబ్ ఎవరో కాదు నిఖిల్ విజయేంద్ర సింహ. తాజాగా నిఖిల్ బర్త్ డే సందర్భంగా నిహారిక ఒక పోస్ట్ చేసింది. నిహారిక నిఖిల్ తో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ నిఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. నువ్వు మొదట్లో హోస్ట్ గా చేసి ఆ తర్వాత కో యాక్టర్ గా మారావు, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ప్రస్తుతం నా చిట్టి తమ్ముడిగా మారావ్ మనం ఇంకా ఎంతో జర్నీ చేయాల్సి ఉంది. ఎంతో మంచి మనసున్న వాళ్ళందరిలో నువ్వు కూడా ఒకడివి. లవ్ యు నిక్కి హ్యాపీ బర్త్డే నానా అంటూ నిహారిక పోస్ట్ చేసింది. ప్రస్తుతం నిహారిక చేసిన పోస్టులో నా చిట్టి తమ్ముడు అంటూ చెప్పడంతో వీరిద్దరి పై వస్తున్న వార్తలకు చెక్ పడింది.

Advertisement
Advertisement