Niharika Konidela : లైఫ్‌లో ఒక్కసారి అలా జరిగింది… గుట్టు విప్పిన నిహారిక

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 17 November 2021, 1:40 pm

niharika konidela : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తొలుత బుల్లితెరపై యాంకర్‌గా కనిపించిన నిహారిక.. ఆ తర్వాత వెబ్ సిరీస్‌లో మెప్పించింది. సినిమాల్లో కూడా కనిపించింది. కానీ సినిమాలు ఆమెకు అంతా పెద్దగా సూట్ కాలేదేమో అని అనిపించింది. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని..

హ్యామీ లైఫ్ గడుపుతుంది నిహారిక. కానీ సినిమాలపై ఆమె అభిరుచి మాత్రం పోలేదు. సినిమాలు నిహారికకు అంతగా కలిసి రాలేదు.అందుకనే నిహారిక ఈ సారి ప్రోడ్యూసర్ అవతారం ఎత్తింది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇది నవంబర్ 19న జీ5లో విడుదల కానుంది. అయితే తాజాగా అలీతో సరదగా కార్యక్రమంలో నిహారిక పాల్గొంది.

niharika konidela says his father beat her once in the past

niharika konidela says his father beat her once in the past

niharika konidela : తండ్రి కొట్టాడట.. నిహారిక చెప్పిన విషయం

అలీ అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిచ్చింది. ఈ క్రమంలోనే నిహారిక తన గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిహారికకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.తన తండ్రి నాగబాబు తనను కొట్టిన ఘటనను ఆమె అలీతో సరదాగా షోలో షేర్ చేసుకుంది. లైఫ్‌లో ఒక్కసారే అలా జరిగిందని చెప్పింది. కారులో ఉన్న సమయంలో ఏదో విషయంలో నాగబాబు తనను కొట్టిన విషయాన్ని వెల్లడించిన నిహారిక..

తాను బోరున ఏడ్చానని చెప్పింది. ఆ తర్వాత కొట్టినందును తన తండ్రి కూడా చాలా ఫీలయ్యాడని తెలిపింది. ఈ విషయాన్ని వేరే వారికి చెప్పి చాలా బాధపడ్డడాని పేర్కొంది. ఈ ఏపిసోడ్‌కు సంబంధించి ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో నిహారిక తన గురించి, మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. పూర్తి ఏపిసోడ్ మాత్రం వచ్చే సోమవారం ప్రసారం కానుంది.

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి