Niharika Konidela : చిన్నప్పుడు స్కూల్‌లో అలా చేసేదట!.. పరువు తీసుకున్న నిహారిక కొణిదెల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Niharika Konidela : చిన్నప్పుడు స్కూల్‌లో అలా చేసేదట!.. పరువు తీసుకున్న నిహారిక కొణిదెల

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంత నాటీయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ అల్లరి చేస్తూనే ఉంటుంది. పెళ్లైనా కూడా ఆ అల్లరి మాత్రం ఇంకా మానలేదు. ఇంకా ఆమెలోని పసితనం పోలేదనిపిస్తుంది. ఇక తాజాగా నిహారిక కొణిదెల తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. అందులో భాగంగా నెటిజన్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు అంటే నేరుగా ప్రశ్నించలేదు. ముందు నిహారిక ఇచ్చిన ఆప్షన్స్, సదరు ప్రశ్నకు సంబంధించిన నంబర్‌ను చెబితే.. నిహారికే ఆ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :8 June 2022,8:00 pm

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఎంత నాటీయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ అల్లరి చేస్తూనే ఉంటుంది. పెళ్లైనా కూడా ఆ అల్లరి మాత్రం ఇంకా మానలేదు. ఇంకా ఆమెలోని పసితనం పోలేదనిపిస్తుంది. ఇక తాజాగా నిహారిక కొణిదెల తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. అందులో భాగంగా నెటిజన్లు కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు అంటే నేరుగా ప్రశ్నించలేదు. ముందు నిహారిక ఇచ్చిన ఆప్షన్స్, సదరు ప్రశ్నకు సంబంధించిన నంబర్‌ను చెబితే.. నిహారికే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. అందులో ఓ క్రేజీ నెటిజన్.. స్కూల్‌లో చేసిన తప్పులను ఒప్పుకో అని అడిగేశాడు. దానికి నిహారిక భలే సమాధానం చెప్పింది. అసలే నిహారిక స్కూల్‌లో ఎంత అమాయకంగా ఉండేదో ఆ మధ్య ఓ సారి చెప్పుకొచ్చింది.

తన తండ్రి నాగబాబు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసిందట. తన తండ్రి కడుపులోనే తాను పుట్టానని నమ్మకంతో ఉండేదట. అందరూ అమ్మ కడుపులో పుడితే.. తాను మాత్రం నాన్న కడుపులో పుట్టానని, తాను ఎంతో స్పెషల్ అనే భ్రమలో నిహారిక ఉండేదట. ఈ విషయాన్ని స్వయంగా తండ్రే చెప్పడంతో నమ్మేసిందట. నాగబాబుకు ఒంటి మీద ఉన్న గాటు ఏంటని చిన్నప్పుడు నిహారిక అడిగితే పై విధంగా కథలుచెప్పాడట. ఆ విషయాన్ని గుడ్డిగా నమ్మిన నిహారిక.. ఆ తరువాత బయాలజీ క్లాసులో అసలు విషయం అర్థమైందట. మొత్తానికి నిహారిక అంత అమాయకంగా ఉండేదన్న మాట.

Niharika Konidela School Age Confession

Niharika Konidela School Age Confession

అలా ఇప్పుడు ఓ నెటిజన్ స్కూల్ మ్యాటర్ అడగడంతో అసలు విషయం చెప్పేసింది. ఈ విషయం చెప్పే ముందు నిహారిక తన మొహాన్ని దాచేసుకుంది. ఇంతకీ నిహారిక చెప్పిన విషయం ఏంటో ఓ సారిచూద్దాం. నిహారిక తన స్కూల్‌లో హోం వర్క్ చేసేది కాదట.. ఖాళీ టైంలో తన అమ్మ వచ్చి అంతా కంప్లీట్ చేసి ఇచ్చేదట. ఈ విషయాన్ని నిహారిక ఇప్పుడు బయటపెట్టేసింది. అంటే నిహారిక స్కూల్ ఏ రేంజ్ ఇంటెలిజెంటో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి నిహారిక అల్లరి మాత్రం అప్పుడు ఇప్పుడు ఏం మారలేనట్టుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది