Niharika Konidela : అతని కోసం టాటూ వేయించుకున్న నిహారిక .. షాక్ లో నాగబాబు..!
ప్రధానాంశాలు:
Niharika Konidela : అతని కోసం టాటూ వేయించుకున్న నిహారిక ..
షాక్ లో నాగబాబు..!
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. హీరోయిన్ గా పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అవి ఏమి ఫలించలేదు. దీంతో నిహారిక నిర్మాతగా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త సినిమాలు నిర్మిస్తున్న సందర్భంగా ఆమె పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొత్తజంట వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. అయితే నిహారిక ప్రొడ్యూసర్ గా వ్యవహరించే చాలా సినిమాలకి కొత్త వాళ్లను తీసుకున్నవారట. ఇక ఈ పూజలో నిహారిక సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని కనిపించింది. ఇక చీరలో ఉన్న నిహారిక ఫోటోలు వైరల్ గా మారాయి. అందులో ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ఫోటోలో నిహారిక వీపు మీద టాటూ వేయించుకుని ఉన్నారు. టాటూ ఎందుకు వేయించుకున్నారు దాని అర్థం ఏంటి అని జనాలు చర్చించుకుంటున్నారు. ఇక నిహారిక వీపు మీద ఉన్న టాటూ పక్షికి సంబంధించినది. ఇక ఈ టాటూ ను విడాకులు తర్వాత వేయించుకున్నారు.
ఇష్టప్రకారమే నిహారిక పెళ్లి చేసుకున్న పెళ్లి తర్వాత ఆమె లైఫ్ మారిపోయింది. అత్తింటి వారు పెట్టే కండిషన్స్ తట్టుకోలేకపోయారట. దాంతో చైతన్యతో కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నిహారిక కాస్త డిప్రెషన్ లోకి వెళ్లినప్పటికీ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ద్వారా నార్మల్ అయ్యారు. విడాకుల తర్వాత నిహారిక పక్షి టాటూ వేయించుకోవడానికి గల కారణం పెళ్లి అయ్యాక తన ఫ్రీడం మొత్తం పోయిందని, పంజరంలో చిక్కిన పక్షి లాగా తన లైఫ్ మారిపోయిందని, ఎప్పుడైతే తనకి విడాకులు వచ్చాయో తను ఫ్రీ బర్డ్ లాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే ఈ టాటూ వెనుక ఉన్న అర్థం ఏంటో తెలియాలంటే నిహారిక స్పందించాల్సి ఉంటుంది.