Home » Entertainment » Niharika Konidela Tattoo On Her Back
Entertainment

Niharika Konidela : నిహారిక వీపుపై టాటూ.. సీక్రెట్ ప్లేస్‌లో వేసుకున్న ఆ బొమ్మ ఎవరిది?

Authored By
aruna
The Telugu News | Published on: September 27, 2022, 7:30 pm
Advertisement

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక నెట్టింట్లో చేస్తోన్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మధ్య నిహారిక మీద విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. పబ్బులో దొరకడం, డ్రగ్స్ వాడిందంటూ కథనాలు బయటకు రావడం, అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటం, భర్తతో విడిపోయిందని, విబేధాలు వచ్చాయంటూ ఇలా నానా రకాలుగా కథనాలు వచ్చాయి. అయితే భర్తతో విడిపోయారన్నది రూమర్‌గానే నిలిచింది. కొన్ని రోజులు కావాలనే ఇన్ స్టాగ్రాం నుంచి నిహారిక దూరంగా ఉండిపోయింది. మొత్తానికి మళ్లీ ఇన్ స్టాగ్రాంలో ఫుల్ బిజీగా మారింది. ఓ వైపు వెబ్ సిరీస్‌లో నిర్మిస్తూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.

Advertisement

ఇక భర్త చైతన్యను కూడా తనతో పాటే తిప్పేసుకుంటోంది. ఈ ఇద్దరూ కలిసి వర్కవుట్లు చేసేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తున్నారు. పెళ్లి తరువాతే నిహారిక జోరు మరింతగా పెరిగింది. కరోనా ఫస్ట్ లాక్డౌన్ తరువాత నిహారిక పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సోషల్ మీడియాలో నిహారిక మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తన కొత్త ప్రాజెక్టుల కోసం గెటప్పులు కూడా మార్చేస్తోంది. ఇప్పుడు నిహారిక షార్ట్ హెయిర్‌తో కనిపిస్తోంది. నిహారిక తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌ను మాత్రమే ఆ వెబ్ సిరీస్ ఆకట్టుకుంది.

Niharika Konidela Tattoo on Her Back

Advertisement

అంతగా హిట్ అవ్వలేదు. చాలా రోజుల తరువాత దేవుళ్లు సినిమాలోని పాప.. ఈ వెబ్ సిరీస్‌‌లో హీరోయిన్‌గా నటించింది. ఆర్యన్ రాజేష్ కూడా చాలా ఏళ్లకు మళ్లీ నటించాడు. అలా ఈ వెబ్ సిరీస్ నిహారికకు మాత్రం అంతగా ఉపయోగపడలేకపోయింది. తాజాగా నిహారిక ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. అందులో తన వీపు భాగంలో ఉన్న టాటూ కనిపించింది. చూస్తుంటే అది నాగబాబు ముఖచిత్రంలా కనిపిస్తోంది. ఇంతకీ ఆ బొమ్మ ఎవరిది? ఆ టాటూ మీనింగ్ ఏంటన్నది నిహారికకే తెలియాలి. మొత్తానికి సెలెబ్రిటీలకు మాత్రం ఈ టాటూల పిచ్చి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి