Niharika Konidela : కేరవ్యాన్‌లో అవి ఉండాల్సిందేనట.. బయటపెట్టేసిన నిహారిక

Authored By aruna | The Telugu News | Published on: August 6, 2022, 6:20 pm

Niharika Konidela : నిహారిక కొణిదెల ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. తాను నటించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది. నిహారిక ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య ఇన్ స్టాగ్రాం నుంచి వైదొలిగింది. దీంతో ఆమె పర్సనల్ లైఫ్ చెడిపోయిందనే రూమర్లు వచ్చాయి. తన భర్తతో విబేధాలు వచ్చాయని, అందుకే వేరుగా ఉంటోందని, డిప్రెషన్స్‌లోకి వెళ్లడంతోనే ఇలా ఇన్ స్టాగ్రాం నుంచి వైదొలిగిందనే టాక్ వచ్చింది. అయితే నిహారికకు సంబంధించిన ఫోటోను చైతన్య షేర్ చేయడంతో రూమర్లకు పుల్ స్టాప్ పడింది. ఆ తరువాత పబ్ వ్యవహారంలో నిహారిక బుక్కైంది. రాడిసన్ పబ్బులో నిహారిక పట్టుబడటం, స్టేషన్‌లో ఉండటం, మత్తు పదార్థాలు సేవించిందనే అనుమానాలు రావడంతో మరింతగా ట్రెండ్ అయింది. వాటిపై నాగబాబు స్పందించిన తీరు కూడా హాస్యాస్పదంగా మారిపోయింది. మొత్తానికి ఆ కేసు మాత్రం ఇంత వరకు తేలలేదు.

ఇక అలా వరుసగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. నిహారిక ఇన్ స్టాగ్రాంకు తిరిగి వస్తూ చేసిన పోస్ట్.. భర్తతో కలిసి జోర్డాన్‌లో వేసిన ట్రిప్, దిగిన ఫోటోలు ఇలా బాగానే వైరల్ అయింది. ఇక ఇప్పుడు నిహారిక హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్‌తో రాబోతోంది. ఇక ఈ ప్రాజెక్టులోనే నిహారిక ప్రస్తుతం బిజీగా ఉంది. అయితే నిహారిక షూటింగ్‌కు వెళ్తే.. ఆమెకంటూ సపరేట్ కేరవ్యాన్ ఉంటుంది. ఇక ఈ మధ్య స్టార్లంతా కూడా తమకు సపరేట్‌గా కేరవ్యాన్‌లను డిజైన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే నిహారికకు సైతం సపరేట్ కేరవ్యాన్ ఉన్నట్టుంది.

Niharika Konidela Vanity Essential Things

Niharika Konidela Vanity Essential Things

ఇందులో భాగంగానే నిహారిక తన కేరవ్యాన్‌లో కచ్చితంగా ఉండాల్సిన వాటి గురించి చెప్పింది. అందులో తన భర్త, తన పెట్ బజ్, తాను కలిసి దిగిన ఫోటో కచ్చితంగా ఉండాలని చెప్పింది. బజ్‌ను చైతన్య ఆ మధ్య నిహారికక ఇచ్చిన మొదటి గిఫ్ట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లైన తరువాత నిహారికకు చైతన్య ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఆ పెట్ బజ్. ఇక బజ్ అంటే నిహారికకు, నాగబాబుకు మహా ఇష్టం. చైతన్యకి కూడా పెట్స్ అంటే బాగానే ఇష్టమున్నట్టు కనిపిస్తోంది.

Niharika Konidela Vanity Essential Things

Niharika Konidela Vanity Essential Things

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp