Niharika : నేర్చుకున్న పాఠాలివే అంటూ రీంట్రీ ఇచ్చిన నిహారిక‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Niharika : నేర్చుకున్న పాఠాలివే అంటూ రీంట్రీ ఇచ్చిన నిహారిక‌

 Authored By sandeep | The Telugu News | Updated on :1 May 2022,6:30 pm

Niharika : మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బుల్లితెరపై నటిగా, హోస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత‌ నిర్మాత‌గా కూడా కొన్ని వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించింది. హీరోయిన్‌గా సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిహారిక పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. రెండేళ్ల ముందు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహం చేసుకుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే నిహారిక కొణిదెల రెండు వారాలుగా పోస్టింగ్స్ చేయ‌కుండా సైలెంట్‌గా ఉంటూ వ‌చ్చారు. అందుకు గల కార‌ణాలేంటో అంద‌రికీ తెలిసిందే.

ఇటీవల జిమ్‌లో షేర్‌ చేసిన ఓ వీడియోపై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. దాంతో సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన మెగా డాటర్.. ఉన్నపళంగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేశారు. ఇక పబ్‌ కేసులో దొరకడం పెద్ద సంచలనంగా మారింది. దాంతో చాలా రోజులు ఇంటికే పరిమితమైన నిహారిక.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం నిహా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అయింది. 8 వారాల్లో తాను నేర్చుకున్న మూడు పాఠాలను అభిమానులతో పంచుకున్నారు.8వారాల ఇన్‌స్టాగ్రామ్‌ బ్రేక్‌ నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవే..

niharika post viral

niharika post viral

Niharika : నిహారిక క‌మ్ బ్యాక్

అంటూ నిహారిక త‌న పోస్ట్‌లో తెలిపింది 1. ”ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు, 2.ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను, 3.ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్‌ అయ్యాను. పోస్టులు చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాను” అంటూ నిహారిక చేసిన పోస్ట్‌ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇక వెల్‌కం బ్యాక్‌ నిహారిక.. నిన్ను చాలా మిస్సయ్యాం అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.నిహారిక కొణిదెలకు సినిమాలలో అంత సక్సెస్ రాకపోయినా.. నిర్మాతగా మాత్రం ముందుకెళ్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగు వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ను నిర్మించారు. ఈ సిరీస్ యూట్యూబ్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది