Niharika : సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున గొడవ విషయంలో నిహారిక అలా మాట్లాడిందేంటి ?
Niharika : ఏపీలో ఎన్నికల వేడి మెగా, అల్లు ఫ్యామిలీ ని తాకింది. అల్లు అర్జున్ .. పవన్ కల్యాణ్ కూటమికి కాకుండా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతిచ్చినప్పటి నుంచీ అతనిపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ అతన్ని అన్ ఫాలో చేశాడన్న వార్త వైరల్ కాగా.. దీనిపై నాగబాబు కూతురు, నటి, నిర్మాత నిహారిక కొణిదెల స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక.. “ఈ విషయం మీరు చెప్పే వరకు కూడా నాకు నిజంగా తెలియదు. కానీ అలా చేయడానికి ఎవరి కారణాలు వారికి ఉండే ఉంటాయి” అని చెప్పడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అంత సులువు కాదు. కానీ నిహారిక మాత్రం అప్పటికప్పుడు కాస్త లౌక్యం జోడించి తెలివిగా సమాధానం చెప్పేసింది.
ఇక వివాదంలోకి వెళితే.. ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తోపాటు అతని పార్టీ జనసేన క్లీన్ స్వీప్ చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో పవన్ కు చోటివ్వడంతోపాటు డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. దీని తర్వాత మెగా ఫ్యామిలీ రేంజ్ మరింత పెరిగింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ ను సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ అన్ ఫాలో చేయడం దుమారం రేపింది. సాయి దుర్గ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్‌ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు. అయితే మిగతా వారు మనస్సులో ఏముంది ..వాళ్లు కూడా అల్లు అర్జున్ ని వదిలేద్దామనే నిర్ణయానికి వచ్చారా అనేది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఈ వివాదాన్ని మొదట్లో ట్వీట్ తో మొదలెట్టిన నాగబాబు కుమార్తె నీహారిక స్టాండ్ ఏమిటి అనేది ఆసక్తికరమైన విషయం.
Niharika : సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున గొడవ విషయంలో నిహారిక అలా మాట్లాడిందేంటి ?
పవన్ కల్యాన్ ప్రమాణ స్వీకారానికి అల్లు కుటుంబం నుంచి ఎవరూ రాకపోవడం కూడా ఈ పుకార్లకు మరింత ఊతమిస్తోంది. మెగా కుటుంబమంతా ఓ పండగలా పవన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని జరుపుకున్న తరుణంలో అల్లు ఫ్యామిలీ లేకపోవడం కచ్చితంగా సందేహాలకు తావిచ్చేదే. బన్నీ ప్రచారం చేసిన తర్వాత “మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే” అంటూ కొణిదెల నాగబాబు చేసిన ట్వీట్ నెల క్రితం సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేదానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు.
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో…
This website uses cookies.