Karthikeya 2 : కార్తికేయ 2 సినిమా కోసం నిఖిల్ తీసుకున్న పారితోషికం ఎంత

Authored By aruna | The Telugu News | Published on: August 23, 2022, 8:40 pm

Karthikeya 2 : నిఖిల్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 సినిమా వంద కోట్ల దిశగా దూసుకు పోతుంది. కార్తికేయ సినిమా విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ కోసం చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కార్తికేయ 2 సినిమా ప్రారంభించి మూడు సంవత్సరాలు అవుతుంది. కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమా విడుదల అయ్యింది. సినిమా కథ మొత్తం కూడా శ్రీకృష్ణుడి చుట్టు తిరుగుతూ ఉంటుంది. సినిమా ను ఒక ఆసక్తికర నోడ్‌ లో దర్శకుడు తీసుకు వెళ్లడంలో సఫలం అయ్యాడు. అందుకే మంచి సక్సెస్ ను దక్కించుకుంది.

ముఖ్యంగా ఈ సినిమా హిందీలో రాబడుతున్న వసూళ్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు నిఖిల్‌ నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిందీలో కనీసం శాటిలైట్‌ ద్వారా కూడా పెద్దగా సక్సెస్ అయ్యింది లేదు. దర్శకుడు చందు మొండేటి కూడా హిందీలో గుర్తింపు ఉన్న హీరో కాదు. అయినా కూడా కార్తికేయ 2 సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేవలం సినిమా కాన్సెప్ట్‌ అక్కడి వారికి నచ్చడం వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి ఒక సినిమా లో హీరోగా నటించిన నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు అనడంలో సందేహం లేదు.

nikhil remuneration for karthikeya 2 movie

nikhil remuneration for karthikeya 2 movie

వంద కోట్ల వసూళ్లు నమోదు చేయబోతున్న కార్తికేయ 2 సినిమా కు గాను నిఖిల్‌ ఎంత పారితోషికం తీసుకున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాను 20 కోట్ల లోపు బడ్జెట్‌ తోనే రూపొందించారు. సినిమాకు పెద్దగా బజ్‌ లేని కారణంగా నిఖిల్‌ కేవల మూడు కోట్ల పారితోషికంను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే లాభాల్లో కొంత మొత్తంను ఇచ్చే విధంగా కూడా ఒప్పందం జరిగిందని కొందరు అంటున్నారు. ఆ లాభాల్లో వాటా ను పక్కన పెడితే ఈ సినిమాకు గాను నిఖిల్‌ కేవలం మూడు కోట్ల పారితోషికం మాత్రమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో నిఖిల్‌ పారితోషికం పది కోట్లకు పెరిగినా ఆశ్చర్యం లేదు.

aruna

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp