
Bigg Boss Telugu 8 : యష్మీని వాడుకున్నావ్ అంటూ నిఖిల్‌పై గౌతమ్ ఫైర్.. నోరు జారడంతో..!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర ఫైట్ జరగుతుంది. టాప్ 5 కోసం ఇప్పుడు పోరాడుతున్నారు. అయితే ఇప్పటికే అవినాష్ ఫినాలేకి చేరుకోగా, మిగతా నలుగురు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.కాగా, ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చే సెకండ్ కంటెస్టెంట్ కోసం బిగ్‌బాస్ టాస్క్ పెట్టాడు. హౌజ్‌మేట్స్ ఫొటోలను గార్డెన్ ఏరియాలో పెట్టాడు. ఫినాలే రేసు నుంచి ఎవరినైతే తప్పించాలని అనుకుంటున్నారో కారణాలు చెబుతూ వారి ఫొటోలను కాల్చేయాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. చివరకు ఎవరి ఫొటో అయితే మిగిలితే వారే ఫైనల్ చేరుతారని, నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని కంటెస్టెంట్స్‌తో బిగ్‌బాస్ చెప్పాడు.ఈ టాస్క్‌లో ముందుగా అవినాష్ …. విష్ణుప్రియ ఫొటో కాల్చేశాడు. బిగ్‌బాస్ నాకు సెట్ అవ్వదు…ఆడలేను అంటూ విష్ణుప్రియ ఏవో చెబుతుంది. అందుకే ఆమె ఫొటో కాల్చేస్తున్నానని అవినాష్ చెప్పాడు.
Bigg Boss Telugu 8 : యష్మీని వాడుకున్నావ్ అంటూ నిఖిల్‌పై గౌతమ్ ఫైర్.. నోరు జారడంతో..!
విష్ణుప్రియ…గౌతమ్ ఫొటోను కాల్చేసింది. ఎవరితో క్లోజ్‌నెస్, రిలేషన్ లేదు… మీరు ఏం ఆడుతున్నారని నాకైతే తెలియడం లేదని గౌతమ్‌తో అన్నది. నేనేంటో నీకు అర్థం కావడం లేదంటే అది నీ ఫాల్ట్ అని గౌతమ్ వాదించాడు. ఆ తర్వాత గౌతమ్ వంతు రాగా, అతను నిఖిల్ ఫొటోను కాల్చేయడంతో రచ్చ మొదలైంది. తనని రాంగ్‌గా పోట్రే చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గట్టి వాగ్వాదం జరిగింది. మాటల్లో ప్రేరణని ఆడుకున్నావని గౌతమ్‌ని నిఖిల్ అన్నాడు. దీంతో రెచ్చిపోయిన గౌతమ్ నువ్వు యష్మిని వాడుకున్నావంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దెబ్బకి విష్ణు ప్రియా షాక్ అయ్యింది. పోట్రే అన్నందుకే నేను ఫినాలేకు వెళ్లకూడదంటే నీ కంటే నాకే ఫినాలేలో అడుగుపెట్టే అర్హత ఎక్కువగా ఉందని నిఖిల్ బదులిచ్చాడు. గొడవ కాస్త పర్సనల్‌లోకి వచ్చింది. సింగిల్ అని చెప్పి యష్మిని వాడుకున్నది నువ్వు అంటూ గౌతమ్ నోరు జారాడు.
ఎవరు వాడుకుంది…నువ్వే వాడుకుంది …తేజతో సహా అందరిని వాడుకుంది నువ్వే అంటూ నిఖిల్ బదులివ్వగానే గౌతమ్ కోపం పట్టలేకపోయాడు. ప్రేరణను వాడుకున్నానని అంటున్నావు…అసలు మా మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా అని గౌతమ్ అన్నాడు. వాడుకున్నావు అనే మాట నేను అనలేదు…ఆడుకున్నావు…వాడుకున్నావు…అనే పదాలకు తేడా తెలియకుండా నువ్వే మాట్లాడుతున్నావని నిఖిల్ ఆన్సర్ ఇచ్చాడు. యష్మిని నేను వాడుకున్నది నువ్వు చూశావా అంటూ గౌతమ్‌ను నిలదీశాడు నిఖిల్. విష్ణు ప్రియా, రోహిణి, అవినాష్ కూడా వ్యతిరేకించారు. దీంతో వెంటన సారీ చెప్పాడు గౌతమ్. అయితే ఈ సారీని నాకు వద్దు అని ఆయన చెప్పడం విశేషం. ఇక నిఖిల్.. రోహిణి పేరు చెప్పారు. చివరిగా నబీల్, ప్రేరణ ఫొటోలు మిగలడంతో వారిని యాక్టివిటీ ఏరియాలోకి బిగ్‌బాస్ పిలిచాడు. వారి ఎదురుగా ఉన్న బ్లాంక్ చెక్‌లలో ఎవరు ఎక్కువ ఎమౌంట్ రాస్తే వారే బిగ్‌బాస్ సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని బిగ్‌బాస్ అన్నాడు. చెక్‌లను చింపేసే ఛాన్స్ కూడా వారికి ఇచ్చాడు. చింపేసే ముందు చెక్‌లపై ఉన్న ఎమౌంట్ చూపించారు. నబీల్ పదిహేను లక్షలు రాయగా…ప్రేరణ నాలుగు లక్షల ముప్పై వేలు రాసింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.