
Tollywood : ఫ్యాన్స్‌ని నిలువు దోపిడి చేస్తున్న స్టార్ హీరోలు.. ఎన్నాళ్ళు ఈ కోట్ల దోపిడి..!
Tollywood : డిసెంబర్ 5న పుష్ప2 Pushpa 2 చిత్రం విడుదల కానుండగా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 షోలకు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేటర్‌లలో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మరోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్ 05 నుంచి 08 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది. అలాగే.. డిసెంబర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేటర్‌లలో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది.
Tollywood : ఫ్యాన్స్‌ని నిలువు దోపిడి చేస్తున్న స్టార్ హీరోలు.. ఎన్నాళ్ళు ఈ కోట్ల దోపిడి..!
డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేటర్‌లలో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. అయితే స్టార్ హీరోలు అభిమానుల జేబులు గుల్ల చేయడం ఏ మాత్రం బాగోలేదంటున్నారు. అగ్ర హీరోల సినిమాలంటే మిడ్‌నైట్ ఫ్యాన్స్ షో, బెనిఫిట్ షోలు వేయడం అనేది చాలాకాలంగా ఉన్న పద్దతి. తమ అభిమాన హీరో సినిమాను ముందుగా చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దాని కోసం ఎంత వెచ్చించడానికైనా అభిమానులు వెనకాడరు. దానిని ఆయుధంగా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు బెనిఫిట్ షో నిర్వాహకులు.
ఫ్యాన్స్ క్రేజ్‌ను బట్టి మెయిన్ సిటీల్లో అభిమానుల కోసం బెనిఫిట్ షోలు ఏర్పాటు చేయడం అనవాయితీ. అయితే ఒకప్పుడు వీటికి రిజనబుల్ రేటు ఉండేది. ఇప్పుడు ఆ రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు అగ్ర తారలు, భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభుత్వం కూడా అదనపు షోలు, టికెట్ రేట్ పెంచడం లాంటి వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఫ్యాన్స్ పేరుతో ఏర్పాటు చేసే బెనిఫిట్ షోల రేట్లకు రెక్కలు వచ్చినట్లుగా వ్యవహారం ఉంది. మామూలుగా మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో సినిమా టికెట్ ధర హై క్లాస్ అయితే రూ.500 ఉంటుంది. కానీ బెనిఫిట్ షో ధర ఆకాశాన్ని అందుకున్నట్లు రూ.2000 పలుకుతుండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అభిమానులు అంటే ప్రాణం, పిచ్చి అన్న హీరోలు వారికి ఫ్రీగా షోలు వేయకుండా ఇలా జేబులు గుల్ల చేసి వారిని ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం బాగోలేదని కొందరు మండిపడుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.