Home » Entertainment » Nirupam Paritala And Majula In Star Maa Pariwar Awards
Entertainment

nirupam paritala : స్టేజ్ మీదే ఆ సీక్రెట్లు చెప్పిన మంజుల.. డాక్టర్ బాబు పరువుపాయే!

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 18, 2021, 6:50 am
Advertisement

nirupam paritala : కార్తీకదీపం సీరియల్‌తో నిరుపమ్ డాక్టర్ బాబుగా ఫేమస్ అయ్యాడు. నెటిజన్లు డాక్టర్ బాబు పేరును అడ్డంగాపెట్టుకుని ఎన్నిరకాల ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. నిరుపమ్ భార్య మంజులకు కూడా ఆ సెగ తగులుతుంటుంది. డాక్టర్ బాబు భార్య అంటూ మంజులను ఆట పట్టిస్తుంటారు. అయితే ఈ ఇద్దరూ కలిసి నెట్టింట్లో తెగ అల్లరి చేస్తుంటారు.

Advertisement

nirupam paritala and majula in star maa pariwar awards

ఈ మధ్యే ప్రారంభించిన యూట్యూబ్ చానెల్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మంజుల నిరుపమ్ అంటూ మొదలుపెట్టిన ఈ చానెల్‌కు నెలలోపే రెండు లక్షల మంది సబ్ స్క్రైబర్లు వచ్చి చేరారు. ఆ రేంజ్‌లో వీరి యూట్యూబ్ చానెల్ దుమ్ములేపుతోంది. తాజాగా స్టార్ మా పరివార్ షోలో మంజుల నిరుపమ్ జోడి అదరగొట్టేసింది. ఉత్తమ భర్త అనే అవార్డును నిరుపమ్ సొంతం చేసుకున్నాడు.

Advertisement

nirupam paritala : అవార్డుల వేడుకలో నిరుపమ్ మంజులు

nirupam paritala and majula in star maa pariwar awards

ఉత్తమ భర్త అంటే ఎలా ఉండాలి? ఎలాంటి వాడిని ఉత్తమ భర్త అంటారో మంజుల చెప్పింది. ఇంట్లో పనులకు సాయం చేస్తే ఉత్తమ భర్త అనరు..అని మంజుల అంటే మధ్యలో సుమ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలకు తీసుకెళ్లేవాడిని ఉత్తమ భర్త అనరు.. వెకేషన్లకు తీసుకెళ్ల వారిని ఉత్తమ భర్త అనరు అని సుమ హింట్ ఇస్తుంటే.. మంజుల కూడా రెచ్చిపోయింది. కానీ చివర్లో మాత్రం తన భర్త మీద ప్రేమను కురిపించింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి