Ysrcp : మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిసొంతా పార్టీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. దివంగత సీఎం వైఎస్ సమకాలీనుడిగా ఉన్న రవీంద్రారెడ్డి ఇటువంటి విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.వైసీపీలోనే ఉన్న మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చాలా కాలం తర్వాత మీడియా ముందరకు వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రవీంద్రారెడ్డి మైదుకూరులో ఆ పార్టీ అభ్యర్థి కోసం పని చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో వైసీపీ పాలన గాడి తప్పుతున్నదని, రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతున్నదని ప్రశ్నించారు. ఏపీలో మంత్రులు ఏం చేయడం లేదని, అన్ని శాఖల తరఫున మంత్రిగా ఒకరే మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షణంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి చేసినవని స్థానికంగా చర్చించుకుంటున్నారు. పేదల భూములను వైసీపీ శాసన సభ్యులే బెదిరించి రాయించుకుంటున్నారని ఆరోపించారు. దువ్వూరులో వైసీపీ ఎమ్మెల్యే రూ.80 లక్షల విలువ చేసే రెండెకరాల ల్యాండ్ తన పేరిట రాయించుకున్నారని ఆరోపించారు. వైసీపీ శాసన సభ్యులే ఎస్సీ, ఎస్టీల భూములను లాక్కుంటున్నారని ఫైర్ అయ్యారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్స్‌పై ఏపీ సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఉన్నత శాఖల అధికారులు వెన్నుముక లేని వారుగా తయారయ్యారని ఆరోపించారు. సీఎం జగన్ మంత్రులకే అపాయింట్‌మెంట్ లేకపోతే, తనలాంటి వ్యక్తులకు దొరకడం చాలా కష్టం కదా అని రవీంద్రారెడ్డి అన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకున్న నేపథ్యంలో వస్తానని ప్రకటించారు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. వచ్చే ఎన్నికల్లో తాను మైదుకూరు శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. వైఎస్ ఫ్యామిలీతో తనకు రిలేషన్ లేకపోయినప్పటికీ రెడ్లకు మంచి జరుగుతుందని, తాను వైసీపీకి మద్దుతు ఇచ్చినట్లు రవీంద్రారెడ్డి తెలిపారు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.