Karthika deepam : డాక్టర్ బాబు ముందే డ్యాన్సులు.. వెడ్డింగే డే వెరైటీ ప్లానింగ్
Karthika deepam : కార్తీకదీపం డాక్టర్ బాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. స్టార్ మాలో కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో, అటు జీ తెలుగులో హిట్లర్ గారి పెళ్లాం అంటూ హిట్లర్ కారెక్టర్‌లో నిరుపమ్ దుమ్ములేపుతున్నాడు. అలా రెండు సీరియల్స్‌తో నిరుపమ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే నిరుపమ్ తన సీరియల్స్, డబ్బింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటాడు.

Nirupam paritala shares wedding day celebrations video
నిరుపమ్ సోషల్ మీడియాలో వేసే పంచ్‌లు, సెటైర్లకు అంతా ఫిదా అవుతుంటారు. స్వతాహాగా రైటర్ అవ్వడంతో ప్రాసల మీద మంచి గ్రిప్పు ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే నిరుపమ్ యూట్యూబ్‌లోనూ దూసుకుపోతోన్నాడు. గత నెలలో తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. మంజుల నిరుపమ్ అనే యూట్యూబ్ చానెల్‌లో వస్తోన్న వీడియోలు, డాక్టర్ బాబు పర్సనల్ విషయాలు చూపిస్తుండటంతో వెంటనే వైరల్ అవుతున్నాయి.
Karthika deepam : డాక్టర్ బాబు వెడ్డింగ్ డే సెలెబ్రేషన్స్

Nirupam paritala shares wedding day celebrations video
మొన్నామధ్య డాక్టర్ బాబు వెడ్డింగ్ డే అని మంజుల కొన్ని సెలెబ్రేషన్స్ చేసింది. కార్తీకదీపం సెట్‌కు వచ్చి మరీ మంజుల.. తన భర్తతో కలిసి తమ వెడ్డింగ్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. అయితే ఆరోజు సాయంత్రం స్పెషల్ ప్రోగ్రాం కూడా చేసినట్టు కనిపిస్తోంది. ఓ రెస్టారెంట్‌కు కుటుంబం, పొరుగింటివాళ్లందరినీ రెస్టారెంట్‌కు తీసుకెళ్లినట్టు కనిపిస్తోంది. ఇక రెస్టారెంట్‌లో డాక్టర్ బాబు ఎంట్రీ ఇవ్వడంతోనే అక్కడి వారంతా లుంగీ డ్యాన్సు అంటూ స్టెప్పులు వేసేశారు.