Karthika Deepam : డాక్టర్ బాబు భార్యకు ఆ హీరో అంటే ఇష్టమట!.. కానీ ఎప్పటికీ చూడదట
Karthika Deepam : కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్ పరిటాల డాక్టర్ బాబుగా ఫుల్ ఫేమస్ అయ్యాడు. నిరుపమ్ అని పిలిచేవారికంటే డాక్టర్ బాబు అని పిలిచే వారే ఎక్కువగా ఉంటారు. అలా ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఇక నిరుపమ్ భార్య మంజుల పరిటాలను కూడా డాక్టర్ బాబు భార్య అని సెటైర్లు వేస్తుంటారు. ఇక ఈ ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసే హల్చల్ మామూలుగా ఉండదు.
నిరుపమ్, మంజుల ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. యూట్యూబ్ చానెల్ పెట్టి రకరకాల వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉన్నారు. యూట్యూబ్ చానెల్ పెట్టిన కొన్ని రోజుల్లోనే సూపర్‌గా క్లిక్ అయింది. డాక్టర్ బాబు ఫాలోయింగ్, క్రేజ్‌కు మిలియన్ల వ్యూస్ వచ్చేస్తున్నాయి. ఇక వీటికి తగ్గట్టు వారు తమ పర్సనల్ విషయాలకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా చేస్తూ వస్తున్నారు.
Nirupam Paritala Wife Manjula Paritala Crush On Mahesh Babu
Karthika Deepam : మహేష్ బాబు అంటే ఇష్టమన్న మంజుల
తాజాగా మంజుల సాయి కుమార్ హోస్ట్‌గా వచ్చే వావ్ షోలో పార్టిసిపేట్ చేసింది. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అయితే ఇందులో మంజులతో పాటు వాసు, మధు అనే సీరియల్ ఆర్టిస్ట్‌లు కూడా వచ్చారు. ఈ షోలో మంజుల తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పింది. మహేష్ బాబు అంటే తనకు క్రష్ అంటా.. కానీ ఆయన్ను మాత్రం ఎప్పటికీ చూడదలుచుకోలేదట. చూస్తే క్రష్ తగ్గిపోతుందనే అలా డిసైడ్ అయిందట.