
Nithiin entry of tweet that put the director in trouble
Nithiin : ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రాముఖ్యత ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో సామాన్యులు, సెలబ్రిటీలు చాలా యాక్టివ్‌గా ఉంటూ అనేక విషయాలు షేర్ చేస్తుంటారు. సోషల్ మీడియా వలన ప్రపంచంలో జరిగే ఏ విషయమైన ఇట్టే తెలిసిపోతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో తప్పుడు ప్రచారాలు ఎక్కువగా నడుస్తున్నాయి. ఒకటికి రెండు కల్పించి సెలబ్రిటీలను నానా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ఈ క్రమంలో వారు వివరణ ఇచ్చుకోవల్సిన పరిస్థితి వస్తుంది. తాజాగా నితిన్ డైరెక్టర్ అనుకోని పరిస్థితి ఎదురైంది. అదేంటో తెలుసుకోవావలంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నితిన్ మంచి హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. భీష్మా తరువాత మళ్ళీ ప్లాప్ లు ఫేస్ చేస్తూ వస్తున్న నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈసినిమా కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఏపీలోని మాచర్ల కు సంబందించిన కథగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డిపై సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి. 2019లో ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. అయితే ఆ ట్వీట్‌ను మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి చేశాడంటూ కొంతమంది రచ్చ చేస్తున్నారు. ఏపీలో ప్రధాన రాజకీయాలకు సంబంధించిన కులాలను కించపరుస్తూ… బూతులు తిడుతున్నట్టుగా… ప్రస్తుతం ఉన్న అధికార పక్ష కులాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఫేక్ పోస్ట్ లు కనిపించాయి. అంతే కాదు వాటికి వివరణ ఇస్తుస్తూ.. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోస్ట్ కూడా అందులో ఉంది. ఫేక్ ఐడీతో ఫేక్ పర్సన్స్ పెట్టేవాటిని నమ్మొద్దంటూ అందులో ఉంది. అయితే ఆ పోస్ట్ పై హీరో నితిన్ కూడా స్పందించారు. ‘ఈ స్క్రీన్ షాట్‌లో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్.
Nithiin entry of tweet that put the director in trouble
ఎవరో కావాలని ఎడిట్ చేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ కింద ఉన్న స్క్రీన్ షాట్‌లో ఉన్న పేరు డిఫరెంట్. ఇప్పుడు నా ప్రొఫైల్‌లో ఉన్న పేరు స్పెల్లింగ్ వేరు. ఫొటో షాప్ చేసిన వాడు ఎవడో సరిగా చేయలేదు. నేను స్వతహాగా వైఎస్ఆర్ అభిమానిని. నేను ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు నా అభిప్రాయాన్ని చెప్పాను తప్పా.. వేరే ఏ కులాన్ని కించపరచలేదు. నేను ఒక్క ట్వీట్ కూడా డిలీట్ చేయలేదు. చేయను కూడా..’ అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఇందుకు తన పేరుతో సర్క్యూలేట్ అవుతున్న స్క్రీన్ షాట్స్‌ను జత చేశాడు. ఈ విషయంపై హీరో నితిన్ సైతం స్పందించాడు. ‘ఒక నకిలీ వ్యక్తి చేసిన ఫేక్ ట్వీట్ అనవసరమైన రచ్చ సృష్టించింది. దురదృష్టవశాత్తు ఇది ఇతరుల మనోభావాలను దెబ్బతీసింది. చాలా విచారకరం. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను..’ అంటూ ట్వీట్ చేశాడు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఒరిజనల్, ఫేక్ ట్వీట్స్‌ను రీట్వీట్ చేశాడు.
కొన్నాళ్లుగా సినిమా వాళ్లకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వైరం నెలకొన్న విషయం తెలిసిందే. టికెట్ల రేటు విషయంలో ఇప్పటికీ నివురు కప్పిన నిప్పులా సమస్య అలాగే ఉంది. నితిన్ సినిమా కూడా ఆంథ్రాలోని మాచర్ల ప్రాంతానికి చెందిన కథ కావడం, దర్శకుడిపై ఇలాంటి పోస్ట్ లు దర్శనం ఇస్తుండటంతో సినిమాపై ఈ ప్రభావం కనిపిస్తుందన్న భయంలో ఉన్నాయు మేకర్స్. నితిన్ పవర్ ఫుల్ మాస్ రోల్ చేస్తున్న ఈసినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి, కాథరిన్ థెరీస్సాలు నటించారు. నితిన్ సొంత బ్యానర్ పై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ఈసినిమాను నిర్మించారు యంగ్ హీరో. ఈ మూవీ నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో పవర్ డైలాగ్స్‌తో నితిన్ అదరగొట్టినట్లు ట్రైలర్ గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వర్గం వారు రాజశేఖర్ రెడ్డి పేరుతో ట్వీట్స్ వైరల్ చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.