Nithiin : గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న నితిన్ రీసెంట్‌గా మాచర్ల నియోజక వర్గం చిత్రంతో పలకరించాడు. ఎమ్మెస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ హీరోయిన్లు. దీనికి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మించారు. నితిన్ మార్కెట్ దృష్ట్యా.. నైజాంలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.20 కోట్లతో కలిపి రూ. 21.20 కోట్ల బిజినెస్ జరిగింది.
అయితే తొలి రోజు ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చినట్టు నితిన్ చెప్పారు. చాలాకాలం తర్వాత నా జోనర్‌ని మార్చి యాక్షన్‌లోకి వెళ్లాను.. ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. యాక్షన్, కామెడీ సీన్స్‌కి ప్రేక్షకుల చప్పట్లు, విజిల్స్ నాలో ఉత్సాహాన్నిచ్చాయి. ఈ సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ రావడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు నితిన్ . ‘‘మా సినిమాని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియన్స్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిఖితా రెడ్డి. ‘‘మా చిత్రాన్ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. ‘‘మా చిత్రం తొలి రోజే రూ. 10కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు కృతీ శెట్టి.
నితిన్.. వెన్నెల కిషోర్ గారి కామెడీ, యాక్షన్ సీన్స్, నా లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అని అన్నాడు. కృతి శెట్టి, డీవోపీ ప్రసాద్ మురెళ్ళ, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ,, అందరూ ది బెస్ట్ వర్క్ ఇచ్చారు. సాగర్ ఇచ్చిన పాటలు , నేపధ్యం సంగీతం సినిమాలో అద్భుతంగా వున్నాయి. ఇలాంటి సమయంలో ఇంత మంచి ఓపెనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది. ఇలాగే కష్టపడుతూ ఇంకా మంచి సినిమాలు తీస్తాను. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు. ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రానికి రెస్పాన్స్ భారీగానే వచ్చింది. అందుకే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4.62 కోట్లు వసూలు చేసింది. తద్వారా నితిన్ నటించిన రీసెంట్ సినిమాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఇది రికార్డు సాధించింది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.