Home » Entertainment » Hyper Aadi Beats Varsha With Tubelights In Mana Oori Devedu Event
Entertainment

Hyper Aadi : షోలో ప్రమాదం.. ట్యూబ్‌లైట్‌తో వర్ష నడుము మీద కొట్టేసిన హైపర్ ఆది

Authored By
aruna
The Telugu News | Published on: August 14, 2022, 4:20 pm
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తుంటారు. ఒకప్పుడు అయితే వీటికే సపరేట్ ప్రోగ్రాంలు ఉండేవి. గతంలో సాహసం చేయరా డింభకా అనే షో వచ్చేది. అందులో వింత వింత వస్తువులను తినడం, శరీరం మీదకు ఎక్కించుకోవడం, శరీరం మీద నుంచి పెద్ద రాళ్లను పెట్టుకుని పగలగొట్టుకోవడడం, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ మాదిరి స్టంట్లు చేస్తుండేవారు. అలాంటి వాటినే జనాలకు సాహసం చేయరా డింభక అంటూ చూపించేవారు. మొత్తానికి ఇప్పుడు అలాంటి షోలు తెలుగులో రావడం లేదు. అయితే వాటిని అప్పుడప్పుడు మల్లెమాల టీం గుర్తు చేస్తుంటుంది. కొన్ని స్పెషల్ ఈవెంట్లు, షోల్లో వాటిని చేయిస్తుంటారు. ఆమధ్య సుధీర్ ఇలాంటి స్టంట్లే చేశాడు. బైక్ స్టంట్లు, నిప్పు, అద్దాలు పగలగొట్టడం, చేతుల మీద నుంచి కార్లను పోనిచ్చుకోవడం వంటివి చేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ అలాంటి ట్రిక్కులే ప్లే చేసినట్టుకనిపిస్తోంది.

Advertisement

వినాయక చవితి సందర్భంగా మల్లెమాల టీం శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులతో ఈవెంట్ చేసింది. మన ఊరి దేవుడు అంటూ చేయబోతోన్న ఈ ఈవెంట్ ప్రోమోను వదిలారు. ఇందులో ఆది, వర్ష, నూకరాజు, ఇమాన్యుయేల్ ఇలా అందరూ ఉన్నారు. అయితే కొత్తగా నాగినీడు, కుష్బూలు వచ్చారు. అన్నపూర్ణమ్మ ఎలాగూ ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ ప్రోమోలో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. ఈప్రోమో చాలా చిన్నగానే కట్ చేసేశారు. అంటే అసలు ప్రోమో ఇంకా ఒకటి ఉందన్నమాట. ఈ నిమిషం నిడివి ఉన్న ప్రోమోలోనే ఎంతో చూపించారు. ఆది, గెటప్ శ్రీనుల డ్యాన్స్.. ఇంద్రజ స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. ఇక కొందరికి అడుక్కునే గెటప్ వేయించి రోడ్డు మీద వదిలేశారు.

Hyper Aadi Beats Varsha With Tubelights in Mana Oori Devedu Event

Advertisement

Hyper Aadi : ట్యూబ్ లైట్‌తో బాదిన ఆది..

ఇక ఇందులో ఓ ప్రమాదకరమైన స్టంట్లు చేసినట్టున్నారు. ఇమాన్యుయేల్ తన చేతుల మీద కార్లను పోనిచ్చుకున్నాడు. ఇక ఆది అయితే ట్యూబ్ లైట్‌తో వర్ష నడుము మీద కొట్టేసినట్టు కనిపిస్తోంది. అది కాస్త బెడిసి కొట్టేసినట్టుంది. వర్షకు తగలరాని చోట తగిలినట్టు కనిపిస్తోంది. మరి నిజంగా ఏం జరిగిందో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి