Chiranjeevi : నితిన్ భార్య‌ చిరంజీవికి మ‌ధ్య రిలేష‌న్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : నితిన్ భార్య‌ చిరంజీవికి మ‌ధ్య రిలేష‌న్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :13 February 2022,3:30 pm

Chiranjeevi : టాలీవుడ్ ల‌వ‌ర్‌బోయ్‌గా ఉన్న నితిన్ హిట్స్, ఫ్లాప్స్ సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న న‌టించిన సినిమాలు ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా హిట్స్ అందుకోలేక‌పోతున్నాయి. అయితే సినిమాల విష‌యాన్ని కాసేపు ప‌క్క‌న పెట్టిన ఆయ‌న కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ కొవిడ్-19 నిబంధనలను అనుసరించి చాలా తక్కువ మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య తన ఇష్టసఖి షాలిని కందుకూరిని మనువాడాడు. 2020 సంవత్సరంలో ఈ ప్రేమ జంట పెళ్లి జరిగింది. అప్పటినుంచి ఎంతో అన్యూన్యంగా దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు నితిన్- షాలిని.

అయితే రీసెంట్‌గా ఈ క్యూట్ కపుల్ నడుమ కరోనా బూచి వచ్చి చేరింది.దానిని కూడా త‌రిమి కొట్టి ప్ర‌స్తుతం సంతోషంగా ఉంటున్నారు.అయితే నితిన్ భార్య షాలిని.. చిరంజీవి ఫ్యామిలీకి స‌న్నిహితురాల‌ని తెలుస్తుంది. శాలిని తల్లిదండ్రులు సంపత్ షేక్ అలాగే నూర్జహాన్ లది కూడా ప్రేమ పెళ్లి కావడం విశేషం.. వీరిద్దరూ కర్నూల్ లో చాలా ఫేమస్ డాక్టర్ లుగా కొనసాగుతున్నారు.. ఇక 20 ఏళ్లుగా అక్కడ ఒక నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ ఉండేవారు. 2008 ఆగస్టులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే కదా. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కర్నూలు జిల్లా నియోజకవర్గం నుంచి నూర్జహాన్ ను నిలబెట్టారు చిరంజీవి.

nithin wife relation to Chiranjeevi

nithin wife relation to Chiranjeevi

Chiranjeevi : ఆ రిలేష‌న్ ఏంటో తెలుసా?

నూర్జ‌హాన్ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు.ఇక అలా చిరంజీవి కి సంపత్, నూర్జహాన్ దంపతులకు మంచి స్నేహం ఉంది. ఈ క్ర‌మంలో షాలినికి కూడా మెగా ఫ్యామిలీతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇష్క్ సినిమా సమయంలో నితిన్ – శాలిని ల మధ్య ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తర్వాత అది కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.నితిన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే మ్యాస్ట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ మూవీ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది