Nithya Menen : ఒంటరిగా కలుద్దామన్న డైరెక్టర్.. కొట్టేందుకు రెడీ అయిన నిత్యామీనన్

Authored By mallesh | The Telugu News | Published on: August 21, 2022, 8:20 pm

Nithya Menen : ప్రముఖ నటి నిత్యామీనన్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఈ మళయాళ కుట్టి తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. చూసేందుకు చిన్నగా ఉన్నా ఫైర్ బ్రాండ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం తమను తాము ఎంతగానో మార్చుకున్నారు. కానీ నిత్యామీనన్ మాత్రం అవకాశాలు రాకపోయినా సరే..తను మాత్రం తనలాగే ఉంటానని.. ఎక్స్‌పోజింగ్ జోలికి అస్సలు పోనని తెగేసి చెప్పేస్తుంది.

Nithya Menen : తప్పుగా ప్రవర్తిస్తే అంతే సంగతులు

నిత్యామీనన్ సినిమా స్టోరీల పట్ల చాలా సెలక్టివ్‌గా ఉంటుందని టాక్. తనకు ఏదైనా నచ్చకపోతే నిరాకరించేందుకు అస్సలు వెనుకాడదని ప్రచారం జరుగుతోంది. సీన్ల విషయంలోనూ, కాస్టూమ్స్ విషయంలోనూ నిత్య ఎక్కడా అడ్జస్ట్ అవ్వదు.ఎక్స్పోజింగ్ సీన్లు, హాట్ లుక్స్‌లో కనిపించమంటే ససేమీరా అంటుందని టాక్. ఒకవేళ దర్శకులు ఎవరైనా ఈ సీన్ చేయాల్సిందే అని పట్టుబడితే అప్పుడు సినిమా వదులుకోవడానికి కూడా ఈ ముద్దుగుమ్మ వెనుకాడదట.. నిత్యామీనన్ చాలా రోజుల తర్వాత తెలుగులో డైరెక్ట్ మూవీ చేసింది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పోటీ పడి మరీ నటించింది. పవన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉందో..

Nitya Menen try to slap directer who wants to meet her alone

Nitya Menen try to slap directer who wants to meet her alone

ఆయన భార్య పాత్రలోనూ నిత్య చాలా పవర్‌వుల్‌గా నటించింది. కెరీర్ ప్రారంభం నుంచి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ బ్యూటీ అప్పట్లో గంగా సినిమాలో దివ్యాంగురాలి పాత్రను కూడా పోషించింది. ఇక పెళ్లివిషయంలో తనకు నచ్చితేనే ఏదైనా అని స్పష్టం చేసిన నిత్యా.. తనతో ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే అస్సలు ఊరుకోదని తెలుస్తోంది. గతంలో గుండెజారి గల్లంతయ్యిందే మూవీ టైంలో దర్శకుడు కొండా విజయ్ కుమార్ నిత్యాను ఒంటరిగా కలువాలని కోరాడట.. ఈ విషయంలో ఈ మళయాలం బ్యూటీ అతన్ని కొట్టేందుకు కూడా వెనుకాడలేదని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అందులో ఎంతమేర వాస్తవం ఉన్నదన్న విషయం మాత్రం తెలియరాలేదు.

mallesh

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp