Nitya Menon : హీరో, డైరెక్టర్ నన్ను చాలా ట్రై చేశారంటూ నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Nitya Menon : హీరో, డైరెక్టర్ నన్ను చాలా ట్రై చేశారంటూ నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు కాగా, ఆమె తన కళ్లతో భావాలను పలికించిగలదు. గ్లామర్ పాత్రలకు, అందాల ఆరబోతకు దూరంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు Nitya Menon నిత్యామీనన్. 40 ఏళ్లకు దగ్గరపడుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Nitya Menon : హీరో, డైరెక్టర్ నన్ను చాలా ట్రై చేశారంటూ నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు
Nitya Menon : అలా అనేసింది ఏంటి..
తాజాగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న ‘సార్ మేడమ్’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇక, ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా నిత్యా మేనన్ తన పెళ్లి విషయమై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పొరపాటున నోరు జారారు. పెళ్లిపై స్పందించాలని రిపోర్టర్లు ఆమెను అడిగారు. దీనిపై నిత్యా మేనన్ స్పందిస్తూ ఈ సినిమా హీరో, దర్శకుడు నన్ను చాలా ట్రై చేశారని చెప్పడంతో ఈవెంట్‌కు వచ్చినవారంతా పగలబడి నవ్వారు.
ఇంతలో విజయ్ సేతుపతి కలగజేసుకుని సరిగ్గా చెప్పండి అంటూ సూచించారు. దాంతో తన పొరపాటు తెలుసుకున్న ఆమె.. తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేయడానికి హీరో, డైరెక్టర్ చాలా ట్రై చేశారని చెప్పారు. దీంతో పొరపాటున నిత్యా నోరు జారిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఇటీవల మాట్లాడుతూ.. పెళ్లి అనేది నా లక్ష్యం కాదని.. వివాహ బంధంతోనే కాకుండా వేరే రకంగా కూడా జీవితాన్ని ఆనందించవచ్చని అన్నారు. ప్రేమించి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోవడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాదని.. ఒంటరితనంతో కొన్నిసార్లు బాధపడినా సోలో లైఫ్ లీడ్ చేయడం బాగుందని నిత్యా మీనన్ తెలిపారు.