nitya menon gives clarity about her marriage
Nitya Menon : సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన నిత్యమీనన్ ఒకరు. బాలీవుడ్ లో కూడా నిత్యా మీనన్ కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే తెలుగులో అయితే నిత్యమీనన్ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పాలి. కమర్షియల్ సినిమాలను కాకుండా డిఫరెంట్ కథలను ఆమె ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటూ ఉంటుంది.ఇటీవల నిత్యా మీనన్ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. మలయాళ స్టార్ హీరోతో ప్రేమాయణం అంటూ కేరళ వెబ్ సైట్లలో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. దీనిపై నిత్యా మీనన్ స్పందించింది. జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేసింది. ఏం తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేసేది ఎవరు అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.
తెలుగులో నాని హీరోగా, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు నిత్యా మీనన్. ఆ తర్వాత 180, ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయింది, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రుద్రమదేవి, జనతా గ్యారేజ్, గమనం, నిన్నిలా నిన్నిలా, స్కైలాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో అలరించారు. నిత్యా మీనన్ తెలుగులో స్కైలాబ్ అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించి, నటించారు. ఇక ఆ మధ్య ఆహాలో ప్రసారమైన ఇండియన్ ఐడల్ సీజన్ వన్ షో కి జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
nitya menon gives clarity about her marriage
నిత్యా మీనన్‌కి ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. నాని నిర్మాతగా 2018 లో వచ్చిన ఆ సినిమాలో నిత్యా మీనన్ లెస్బియన్‌గా నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె ఈషా రెబ్బాతో కలిసి జంటగా నటించింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిత్యామీనన్ నిన్నిలా నిన్నిలాలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడదులై మంచి ఆదరణ పొందింది. ఇక ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోన్న మెడ్రన్ లవ్ వెబ్ సిరీస్‌లో నటించి మరోసారి మెప్పించారు. నిత్యా మీనన్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.