Nitya Menon : పెళ్లి లేదు గిళ్లీ లేదు.. ఎవ‌డ్రా వాడు త‌ప్పుడు ప్ర‌చారాలు చేసేది అంటూ నిత్యా మీన‌న్ ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nitya Menon : పెళ్లి లేదు గిళ్లీ లేదు.. ఎవ‌డ్రా వాడు త‌ప్పుడు ప్ర‌చారాలు చేసేది అంటూ నిత్యా మీన‌న్ ఫైర్

 Authored By sandeep | The Telugu News | Updated on :21 July 2022,8:30 pm

Nitya Menon : సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన నిత్యమీనన్ ఒక‌రు. బాలీవుడ్ లో కూడా నిత్యా మీనన్ కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే తెలుగులో అయితే నిత్యమీనన్ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పాలి. కమర్షియల్ సినిమాలను కాకుండా డిఫరెంట్ కథలను ఆమె ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటూ ఉంటుంది.ఇటీవల నిత్యా మీనన్ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. మలయాళ స్టార్ హీరోతో ప్రేమాయణం అంటూ కేరళ వెబ్ సైట్లలో కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. దీనిపై నిత్యా మీనన్ స్పందించింది. జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేసింది. ఏం తెలుసుకోకుండా త‌ప్పుడు ప్ర‌చారాలు చేసేది ఎవ‌రు అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.

Nitya Menon : నిత్యా క్లారిటీ..

తెలుగులో నాని హీరోగా, నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు నిత్యా మీన‌న్. ఆ తర్వాత 180, ఇష్క్, ఒక్కడినే, జబర్దస్త్, గుండెజారి గల్లంతయింది, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రుద్రమదేవి, జనతా గ్యారేజ్, గమనం, నిన్నిలా నిన్నిలా, స్కైలాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో అలరించారు. నిత్యా మీనన్ తెలుగులో స్కైలాబ్ అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించి, నటించారు. ఇక ఆ మధ్య ఆహాలో ప్రసారమైన ఇండియన్ ఐడల్ సీజన్ వన్ షో కి జడ్జిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

nitya menon gives clarity about her marriage

nitya menon gives clarity about her marriage

నిత్యా మీన‌న్‌కి ప్ర‌యోగాలు చేయ‌డమంటే చాలా ఇష్టం. నాని నిర్మాతగా 2018 లో వచ్చిన ఆ సినిమాలో నిత్యా మీనన్ లెస్బియన్‌గా నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె ఈషా రెబ్బాతో కలిసి జంటగా నటించింది. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా నిత్యామీనన్ నిన్నిలా నిన్నిలాలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడదులై మంచి ఆదరణ పొందింది. ఇక ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోన్న మెడ్రన్ లవ్ వెబ్ సిరీస్‌లో నటించి మరోసారి మెప్పించారు. నిత్యా మీన‌న్ ఎప్పుడు ఏదో ఒక విష‌యంతో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది