Sukumar : నా త‌దుపరి చిత్రం రామ్ చ‌ర‌ణ్‌తోనే.. క‌న్‌ఫాం చేసిన సుకుమార్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sukumar : నా త‌దుపరి చిత్రం రామ్ చ‌ర‌ణ్‌తోనే.. క‌న్‌ఫాం చేసిన సుకుమార్

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2025,3:40 pm

Sukumar : పెద్ది తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో చేయాల్సిన మూవీ కొంచెం ఆలస్యమవుతుందని, ఈలోగా వేరే డైరెక్టర్ తో ఇంకో ప్రాజెక్టు చేస్తారని ప్ర‌చ‌రాలు గ‌ట్టిగా న‌డిచాయి. ఈ క్ర‌మంలో ఆ వార్త‌ల‌కి సుకుమార్ స్వ‌యంగా చెక్ పెట్టారు. తన నెక్స్ట్ సినిమా ఆర్సి 17 అని, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్స్ జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చేశారు. జానర్, ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందనే వివరాలు చెప్పలేదు కానీ క్లారిటీ అయితే ఇచ్చారు.

Sukumar : క‌న్‌ఫాం చేశాడు..

వచ్చే ఏడాది మార్చిలో పెద్ది రిలీజవుతుంది. ఇంకా పదినెలల సమయం ఉంది కాబట్టి సుకుమార్ కు తగినంత సమయమేనని చెప్పాలి. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో థియేటర్ సినిమాలు చూస్తున్నారని, నగరాల్లో యువత యాప్స్, ఓటిటికి అలవాటు పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన సుకుమార్ వాస్తవిక కోణంలో మాట్లాడారు.

Sukumar నా త‌దుపరి చిత్రం రామ్ చ‌ర‌ణ్‌తోనే క‌న్‌ఫాం చేసిన సుకుమార్

Sukumar : నా త‌దుపరి చిత్రం రామ్ చ‌ర‌ణ్‌తోనే.. క‌న్‌ఫాం చేసిన సుకుమార్

పుష్పలో బిజీగా ఉండటం వల్ల మూడేళ్లు స్వంత ఊరికి రాలేకపోయాయని చెప్పిన సుకుమార్ పిల్లలు, యూత్, స్థానికులతో చాలా సమయం గడిపి అక్కడి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఇక ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. పెద్ది తర్వాత రామ్ చరణ్ 17 సుకుమార్ తోనే. కాకపోతే ఎంత సమయం పడుతుందనేది మాత్రం ఇప్పట్లో చెప్పలేం. రంగస్థలం, పెద్ది లాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ కాకుండా సుకుమార్ ఈసారి జానర్ మారుస్తారని తెలిసింది. చరణ్ కు మరింత ఛాలెంజ్ అనిపించేలా కొత్త తరహా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది