jr Ntr : ఎన్టీఆర్‌ పెళ్లి కట్నం ఎంతో తెలుసా? అప్పుడు వయసు చాలా పెద్ద రచ్చ

Authored By Tech Desk | The Telugu News | Published on: October 1, 2022, 8:00 pm

jr Ntr : టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి ( lakshmi pranathi )ల జోడి ఒకటి అనడంలో సందేహం లేదు. వీరిద్దరి పెళ్లి 2011 మే 6వ తారీఖున అత్యంత వైభవంగా జరిగింది. అప్పట్లో రాష్ట్రంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతి తో ఎన్టీఆర్ పెళ్లి ఫిక్స్ చేసింది చంద్రబాబు నాయుడు అంటూ అప్పట్లో ప్రచారం జరిగేది. అంతా అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు ఆ పెళ్లి దగ్గరుండి మరి చేసినట్లుగా ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో అత్యంత ఖరీదైన ల్యాండ్ బ్యాంక్ ఉన్న నార్నే వారి ఇంటి కూతురిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం ద్వారా అప్పట్లోనే దాదాపు 250 కోట్ల రూపాయల కట్నం దక్కించుకున్నట్లుగా సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌.

నార్నె ఫ్యామిలీ వారు లక్ష్మీ ప్రణతికి ఇచ్చిన కట్నం విలువ ఇప్పుడు దాదాపుగా రూ.1200 కోట్ల వరకు ఉంటుంది అనేది టాక్. ఆ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతిల వివాహం సమయంలో వయసు గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఎన్టీఆర్ ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కొందరు యాంటీ నందమూరి ఫ్యాన్స్ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ మైనర్ బాలికను వివాహం చేసుకోబోతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అసలు మేటర్ ఏంటా అంటూ ఎంక్వౌయిరీ చేసిన మీడియా వాళ్లకు తెలిసిన విషయమేంటంటే లక్ష్మీ ప్రణతి పెళ్లి కాకముందే మేజర్ అయింది, కనుక ఎన్టీఆర్ మైనర్ ని వివాహం చేసుకోలేదు.

Ntr and lakshmi pranathi interesting marriage story

Ntr and lakshmi pranathi interesting marriage story

అప్పటి చట్ట ప్రకారం ఎన్టీఆర్ పెళ్లి జరిగింది… అయినా కూడా కొందరు అప్పట్లో తెగ హడావుడి చేసి ఎన్టీఆర్ ని ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నించారు. ఎన్టీఆర్ ది ప్రేమ వివాహం కాకపోవచ్చు కానీ ఇద్దరు కూడా 12 సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటూ ప్రేమికుల కంటే ఎక్కువ ఆప్యాయతను పంచుకుంటున్నారు. వారిద్దరి ప్రేమకు సజీవ సాక్షంగా వారి ఇద్దరి కొడుకులు నిలుస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కట్నం విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ కి ఒక మంచి అమ్మాయి భార్యగా దక్కింది అంటూ అభిమానులు ఆనందించే విషయం. ఎన్టీఆర్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఆమె ధైర్యంగా వెంట నిలిచి ఎన్టీఆర్‌ స్టార్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ల జోడీ ఇలాగే నిండు నూరేళ్లు ఉండాలని వారి అభిమానులతో పాటు మా తరఫున కూడా ఆశిస్తున్నాం.

Tech Desk

No bio available for this author.

  1. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  2. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  3. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  4. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  5. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

  6. "Medha Heroine : టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌నున్న స్టార్ హీరో కుమార్తె .. ఫస్ట్‌ లుక్ అదుర్స్‌..!"

  7. "Pawan Kalyan : స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతపై పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్.. పొత్తులో తేడా వస్తే అంతే సంగతులా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp