
NTR gave special names to sons in daughters and grandchildren
NTR : తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ పరంగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి . చాలా మంది పేద ప్రజలు ఎన్టీఆర్‌ని దేవుడిగా కొలుస్తుంటారు. అయితే ఎన్టీఆర్ పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్ బసవతారకంను వివాహం చేసుకున్న తర్వాత వీరికి ఎనిమిది అబ్బాయిలు, నలుగురు కూతుళ్లు జన్మించారు.
ఎన్టీఆర్‌కి హిందూ ధర్మం అన్నా ఆచారాలు సంప్రదాయాలు, తెలుగు భాష అన్నా కూడా ఎంతో గౌరవం ఉండేది. ఎన్టీఆర్ తన కొడుకులు, కూతుళ్లకు, మనవరాలకి పెట్టిన పేర్లు చూస్తే చాలా ఆయన భాషా జ్ఞానం భాష పై ఉన్న ప్రేమ మనకు అర్థమైపోతాయి. కుమారులు, కూతుళ్లు అందరి పేర్లకు కూడా చివరన ప్రాస కుదిరేలా ఎన్టీఆర్ నామకరణం చేయడం విశేషం. ఏడుగురు కొడుకుల పేర్ల చివరణ కృష్ణ అనే పదం ఉండేలా పేర్లు పెట్టారు. రామకృష్ణ, సాయికృష్ణ, జయ కృష్ణ, బాల కృష్ణ, హరికృష్ణ అని ఇలా పేర్లు పెట్టారు. ఇక కూతుళ్ల విషయానికి వస్తే నలుగురు కూతుళ్ల పేర్ల చివర ఈశ్వరి అనే పేరు వచ్చేలా పేర్లు పెట్టారు.
NTR gave special names to sons in daughters and grandchildren
లోకేశ్వరి, పురందేశ్వరి, ఉమామహేశ్వరి, భువనేశ్వరి అని నామకరణం చేశారు. ఇక రెండో తరంలోనూ ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు జయకృష్ణ కుమార్తె పేరు కుమిదిని అని పెట్టగా, రెండవ కుమారుడికి ఇద్దరు కూతుళ్లు ఉండగా వారి పేర్లు శ్రీమంతుని, మనశ్విని అని నామకరణం చేశారు. బాలకృష్ణ ఇద్దరు కూతుళ్లు బ్రాహ్మిణి, తేజస్విణి గా నేరు పెట్టారు. చిన్న కుమారుడు సాయకృష్ణ కుమార్తె పేరు కూడా ఈషాణి అని ఎన్టీఆరే పెట్టారట. ఇక ఈ పేర్లు వింటేనే ఎన్టీఆర్ ది ఎంత కళాత్మక హృదయం అర్థం చేసుకోవచ్చు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.