NTR : కొడుకులు, కూతుళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌కి ప్ర‌త్యేక‌మైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్.. దీని వెన‌క ఉన్న క‌హానీ తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : కొడుకులు, కూతుళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌కి ప్ర‌త్యేక‌మైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్.. దీని వెన‌క ఉన్న క‌హానీ తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :26 November 2022,1:40 pm

NTR : తెలుగు చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా ఉన్న‌ సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ పరంగా కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఆయ‌న ప్రవేశపెట్టిన ప‌థ‌కాలు పేద ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ్డాయి . చాలా మంది పేద ప్ర‌జ‌లు ఎన్టీఆర్‌ని దేవుడిగా కొలుస్తుంటారు. అయితే ఎన్టీఆర్ ప‌ర్స‌న‌ల్ విషయాల గురించి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఎన్టీఆర్ బసవతారకంను వివాహం చేసుకున్న తర్వాత వీరికి ఎనిమిది అబ్బాయిలు, న‌లుగురు కూతుళ్లు జ‌న్మించారు.

ఎన్టీఆర్‌కి హిందూ ధ‌ర్మం అన్నా ఆచారాలు సంప్ర‌దాయాలు, తెలుగు భాష అన్నా కూడా ఎంతో గౌర‌వం ఉండేది. ఎన్టీఆర్ త‌న కొడుకులు, కూతుళ్ల‌కు, మ‌న‌వ‌రాల‌కి పెట్టిన పేర్లు చూస్తే చాలా ఆయ‌న భాషా జ్ఞానం భాష పై ఉన్న ప్రేమ మ‌న‌కు అర్థ‌మైపోతాయి. కుమారులు, కూతుళ్లు అంద‌రి పేర్ల‌కు కూడా చివ‌ర‌న ప్రాస కుదిరేలా ఎన్టీఆర్ నామ‌క‌ర‌ణం చేయ‌డం విశేషం. ఏడుగురు కొడుకుల పేర్ల చివ‌ర‌ణ కృష్ణ అనే ప‌దం ఉండేలా పేర్లు పెట్టారు. రామ‌కృష్ణ‌, సాయికృష్ణ‌, జ‌య కృష్ణ‌, బాల కృష్ణ, హ‌రికృష్ణ అని ఇలా పేర్లు పెట్టారు. ఇక కూతుళ్ల విష‌యానికి వ‌స్తే న‌లుగురు కూతుళ్ల పేర్ల చివ‌ర ఈశ్వ‌రి అనే పేరు వ‌చ్చేలా పేర్లు పెట్టారు.

NTR gave special names to sons in daughters and grandchildren

NTR gave special names to sons in daughters and grandchildren

NTR : తెలుగుపై ఎంత మ‌క్కువ‌..!

లోకేశ్వ‌రి, పురందేశ్వ‌రి, ఉమామ‌హేశ్వ‌రి, భువ‌నేశ్వ‌రి అని నామ‌క‌రణం చేశారు. ఇక రెండో త‌రంలోనూ ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క మాన‌దు. ఎన్టీఆర్ త‌న పెద్ద కుమారుడు జ‌య‌కృష్ణ కుమార్తె పేరు కుమిదిని అని పెట్ట‌గా, రెండ‌వ కుమారుడికి ఇద్ద‌రు కూతుళ్లు ఉండ‌గా వారి పేర్లు శ్రీమంతుని, మ‌న‌శ్విని అని నామ‌క‌ర‌ణం చేశారు. బాల‌కృష్ణ ఇద్ద‌రు కూతుళ్లు బ్రాహ్మిణి, తేజ‌స్విణి గా నేరు పెట్టారు. చిన్న కుమారుడు సాయ‌కృష్ణ కుమార్తె పేరు కూడా ఈషాణి అని ఎన్టీఆరే పెట్టార‌ట‌. ఇక ఈ పేర్లు వింటేనే ఎన్టీఆర్ ది ఎంత‌ క‌ళాత్మ‌క హృద‌యం అర్థం చేసుకోవ‌చ్చు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది