Jr NTR : వార్ 2 ఈసారి యుద్ధం పూర్తి చేయాలని ఫిక్స్ అయిన ఎన్టీఆర్..!
Jr NTR : దేవర Devara Movie తో బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన మాస్ స్టామినా ఏంటో చూపించిన Jr Ntr ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న తారక్ ఈ సినిమా తో బాలీవుడ్ ఆడియన్స్ కు మరింత దగ్గర కానున్నాడు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నువ్వా నేనా అనే రేంజ్ లో ఈ సినిమాలో సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇదిలాఉంటే వార్ 2 సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే దానికి తగినట్టుగా షూటింగ్ చేస్తున్నారు. ఈమధ్య షూటింగ్ కు కొద్దిగా బ్రేక్ ఇవ్వగా లేటెస్ట్ గా మళ్లీ వార్ 2 షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ముంబై వెళ్లాడు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Jr NTR : వార్ 2 ఈసారి యుద్ధం పూర్తి చేయాలని ఫిక్స్ అయిన ఎన్టీఆర్..!
ఎన్టీఆర్ ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే వార్ 2 కోసం ఇది చివరి షెడ్యూల్ అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ దాదాపు పూర్తి అవుతుందని టాక్. హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ వార్ 2 యుద్ధం ముగించే వరకు ఈ షెడ్యూల్ కొనసాగిస్తారని తెలుస్తుంది.
ఇదిలాఉంటే ఈమధ్యనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా మొదలైంది. రమఓజీ ఫిల్మ్ సిటీలో భారీ రేంజ్ లో యాక్షన్ సీన్ తోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అక్కడ షెడ్యూల్ పూర్తి కాబట్టే తారక్ వార్ 2 కోసం ముంబై వెళ్లాడని తెలుస్తుంది. ఐతే ఈ షెడ్యూల్ తో సినిమాలో తన పోర్షన్ పూర్తి చేస్తాడని చెప్పుకుంటున్నారు. మరి వార్ 2 లో ఎన్ టీ ఆర్ ఏ రేంజ్ లో అదరగొట్టేస్తాడో చూడాలి. ప్రశాంత్ నీల్ తో తారక్ చేస్తున్న సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ అని అంటున్నారు. ఐతే అఫీషియల్ గా మాత్రం చెప్పలేదు. NTR, Hrithik Roshan, War 2, Ayan Mukharjee, Bollywood
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.