Nuvvu Naku Nacchav : ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని పింకీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

Authored By aruna | The Telugu News | Published on: July 31, 2022, 8:30 am

Nuvvu Naku Nacchav : విక్టరీ వెంకటేష్ హీరోగా, ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సినిమా ‘ నువ్వు నాకు నచ్చావ్ ‘. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్, ప్రతి డైలాగ్ ఇప్పటికి కూడా ప్రేక్షకులకు గుర్తుంది. అలాగే ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమాగా ప్రేక్షకుల మనసులో ఉండిపోతుంది. ఈ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ టెలివిజన్లో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లతో పాట గుర్తుండిపోయే మరొక పాత్ర పింకీ.

‘ నువ్వు నాకు నచ్చావ్ ‘ సినిమాలో పింకీ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా నటించింది. పింకీగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే పింకీ అసలు పేరు సుదీప. ‘ నువ్వు నాకు నచ్చావ్ ‘ చిత్రం తర్వాత సుదీప బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లెజెండ్ వంటి పలుచిత్రాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే బుల్లితెర మీద ప్రసారం అయిన పలు సీరియల్స్ లో కూడా సుదీప నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Nuvvu naku nacchav movie pinky latest pics

Nuvvu naku nacchav movie pinky latest pics

సుదీప ఎంబీఏ వరకు చదువుకుంది. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా శ్రీ రంగనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాదులో సెటిల్ అయింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో సుదీపకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ లేటెస్ట్ ఫోటోలలో సుదీప తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. చూసిన వాళ్లంతా అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది పింకి అని అనుకుంటున్నారు.

Nuvvu naku nacchav movie pinky latest pics

Nuvvu naku nacchav movie pinky latest pics

Also read

aruna

No bio available for this author.

  1. "Elon Musk : ఇండియాలో ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్‌లింక్ లైసెన్స్‌పై కేంద్రం సంచలన నిర్ణయం!"

  2. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  3. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  4. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  5. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  6. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  7. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp