Home » Entertainment » Nuvvu Nenu Prema 02 August 2023 Wednesday 378 Full Episode
Entertainment

Nuvvu Nenu Prema 2 Aug Today Full Episode : కొండ మీదికి ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్న పద్మావతి.. వెక్కివెక్కి ఏడ్చిన విక్రమాదిత్య

Authored By
Varun G
The Telugu News | Updated on: August 2, 2023, 9:04 am
Advertisement

Nuvvu Nenu Prema 2 Aug Today Full Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. నువ్వు నేను ప్రేమ 2 ఆగస్టు 2023, బుధవారం ఎపిసోడ్ 378 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పద్మావతి ఎంత బతిమిలాడినా కూడా భక్త వినడు. నువ్వు ఎట్టా వచ్చావో అట్టే ఇంటికి వెళ్లు. ఇంకెప్పుడు ఇంటికి రాకు అంటాడు. మమ్మల్ని పట్టించుకోనప్పుడు.. మమ్మల్ని బాధపెట్టి ఇప్పుడు ఇంటికి రావడం ఎందుకు అంటాడు. దీంతో నేను చావనైనా చస్తా కానీ.. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను. నా వల్ల కాదు అంటుంది పద్మావతి. పిన్ని మీరు అయినా చెప్పండి అంటుంది. బావ గారు అని లక్ష్మీ అనగా.. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే అందులో ఎలాంటి మార్పు ఉండదు. తనను వెళ్లమని చెప్పు అంటాడు భక్త. అక్క నువ్వైనా చెప్పు అంటే.. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా.. అని ఆండాలు సీరియస్ అవుతుంది. ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు.. పోవే అంటుంది ఆండాలు.

Advertisement

నేను ఈ ఇంటి బిడ్డను. మా నాన్న కూతురును. నాయినా.. నువ్వైనా చెప్పు నాయనా. నువ్వు లేకుండా నేను ఉండలేను నాయనా అంటుంది. కానీ.. ఎవ్వరూ తగ్గరు. నువ్వు ఇక్కడే ఉంటే వాడు గుండె పగిలి చస్తాడు. పోవే బయటికి అంటుంది ఆండాలు. చివరకు బయటికి నెట్టేస్తుంది. దీంతో పోతా.. మీరు లేకపోతే నాకు ఎవ్వరూ లేరని అనుకుంటున్నారా? నాకోసం మా ఆయన ఉన్నారు. ఆడికే పోతా అని బ్యాగు తీసుకొని బయటికి వెళ్తుంది పద్మావతి. మరోవైపు కారులో పద్మావతి పగిలిన గాజును చూస్తాడు విక్కీ. కారు సడెన్ గా ఆపడంతో తన గాజు పగలడం చూస్తాడు. తనకు బాధ వేస్తుంది. తన పాత మెమోరీస్ గుర్తొస్తాయి.

Advertisement

Nuvvu Nenu Prema 2 Aug Today Full Episode : అరవిందకు ఫోన్ చేసిన అను

మరోవైపు తన నానమ్మ దీనంగా కూర్చోవడం చూసి తన దగ్గరికి వెళ్తుంది అరవింద. ఏంటి నానమ్మ నేను ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎంత సేపు అయింది. ఇప్పటి వరకు వేసుకోలేదు. ఇలా అయితే ఎలా నానమ్మ. వేసుకోండి అంటుంది. మనసు టెన్షన్ గా ఉంది అంటుంది నానమ్మ. ఏమైంది అంటే.. పద్మావతి గురించే టెన్షన్ అంటుంది. విక్కీ తీసుకెళ్లాడు కదా అని చెబుతుంది అరవింద. దీంతో అదే నా టెన్షన్. వాళ్ల నాన్న వచ్చి పద్మావతిని తీసుకెళ్లలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్లాక ఏం జరుగుతుందో అని టెన్షన్ అంటుంది. దీని వల్ల మన విక్కీ కూడా బాధపడాల్సి వస్తుందేమో అంటుంది. పద్మావతి వాళ్ల నాన్న గారు ఈ విషయంలో కాస్త పెద్ద మనసు చేసుకుంటే మంచిది. తన కోపాన్ని తగ్గించుకుంటేనే పద్మావతి బాధ కూడా తగ్గుతుంది అంటుంది అరవింద. మీరు టెన్షన్ పడకండి. కాసేపయ్యాక నేనే ఆ విషయం గురించి అడిగి తెలుసుకుంటాను అని భరోసా ఇస్తుంది అరవింద.

కట్ చేస్తే.. పద్మావతి ఎక్కడికి వెళ్లిందో అని టెన్షన్ పడి.. వెంటనే విక్కీకి కాల్ చేస్తుంది అను. కానీ.. విక్కీ ఫోన్ కలవదు. దీంతో ఏం చేయాలో అనుకు అర్థం కాదు. రోడ్డు మీద ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంటుంది పద్మావతి. వెంటనే అరవిందకు ఫోన్ చేస్తుంది అను. నేనే నీకు కాల్ చేద్దామని అనుకుంటున్నా. పద్మావతి వచ్చిందా. తనను మీ నాన్న గారు ఏం అనలేదు కదా. ఒకసారి పద్మావతి ఫోన్ ఇవ్వు అంటుంది అరవింద. దీంతో అను వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే.. పద్మావతి ఇంటికే బయలుదేరింది అంటుంది. దీంతో అరవింద షాక్ అవుతుంది. పద్మావతి మీ ఇంటికే వచ్చింది కదా అంటే.. తను వచ్చింది కానీ.. అంటూ ఆగిపోతుంది. ఎంతో సంతోషంగా వచ్చిన పద్మావతిని తిట్టి పంపించేశారు అంటుంది అను.

Advertisement

తను చాలా బాధపడుతోంది. నేను ఎంత చెప్పినా మా వాళ్లు నా మాట కూడా వినలేదు. విక్కీకి కాల్ చేస్తా అని చెప్పింది కానీ.. విక్కీ ఫోన్ కలవడం లేదు. పద్మావతి అక్కడికి వచ్చిందేమో అని కాల్ చేశా అంటుంది. తను ఇక్కడికి రాలేదు అంటుంది అరవింద. నేను కనుక్కుంటాను. మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. మరోవైపు పద్మావతి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఇంతలో అరవింద ఫోన్ చేస్తుంది విక్కీకి. నీతో పద్మావతి ఉందా అని అడుగుతుంది. దీంతో తనను వాళ్ల ఇంట్లో వదిలాను అంటాడు.

దీంతో పద్మావతిని వాళ్ల నాన్న, అత్త తనను ఇంట్లో నుంచి బయటికి పంపించేశారట. తనకు కాల్ చేస్తే కలవడం లేదు అంటుంది అరవింద. తను ఎక్కడుందో అని టెన్షన్ గా ఉంది అంటుంది. దీంతో వెంటనే కారు వెనక్కి తిప్పి.. పద్దుకు ఫోన్ చేస్తాడు కానీ.. తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఊరంతా వెతుకుతాడు కానీ.. పద్మావతి జాడ తెలియదు. పద్మావతి అక్కడికి వచ్చిందా అని అనుకు ఫోన్ చేస్తాడు విక్కీ. దీంతో లేదు అంటుంది. సరే.. నేను తనని వెతికి తీసుకొస్తా అంటాడు. మీరు భయపడకండి అంటాడు.

ఇంతలో పద్మావతి ఒక అమ్మవారి గుడికి వెళ్తుంది. ఏదమ్మా ఇది. నేను ఎవరికోసం అయితే బతుకుతున్నానో వాళ్లే నన్ను కాదు పొమ్మన్నారు. అనాథను అయిన నాకు అన్నీ అమ్మానాన్నే కదా అంటుంది. ఆ తర్వాత చనిపోవడానికి ఓ గుట్ట మీదికి వెళ్తుంది. నన్ను క్షమించండి. అక్క పెళ్లి ఆగకూడదని నేను ఇలా చేశా. అయినా నేను చేసింది తప్పే. దానికి శిక్షగా చావాలనుకుంటున్నా అంటూ కొండ మీది నుంచి దూకుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి