Ramya Krishnan : రమ్యకృష్ణ ను ఫుల్ గా వాడేస్తున్న ఓంకార్ అన్నయ్య.. సూపర్ సూపర్ సూపర్
Ramya Krishnan : ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి మంచి స్పందన దక్కుతుంది. అందుకు కారణం ఓంకార్ తనదైన శైలిలో కార్యక్రమాన్ని డిజైన్ చేయడం. అంతే కాకుండా జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న రమ్యకృష్ణ మరియు శేఖర్ మాస్టర్ లను సాధ్యమైనంత వరకు వాడేసుకుంటున్నాడు. ఇటీవల శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ చూపించి అందరిని కట్టి పడేసి డాన్స్ ఐకాన్ లో ఏదో జరుగుతుంది అని చెప్పకనే చెప్పే విధంగా ప్రోమో కట్ చేశాడు. ఇప్పుడు రమ్యకృష్ణ ని కూడా సాధ్యమైనంతగా ఉపయోగించుకొని తన షో కి మంచి పాపులారిటీ దక్కేలా ఓంకార్ ప్రయత్నిస్తున్నాడు. రమ్యకృష్ణ విషయంలో ఓంకార్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యంగా ఉంది.
ఆమె ఒక లేడీ లెజెండ్ అనడంలో సందేహం లేదు, అలాంటి వ్యక్తిని ఉపయోగించుకొని తన కార్యక్రమానికి సాధ్యమైనంత పబ్లిసిటీ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆమెకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. కనుక ఆ రెమ్యూనరేషన్ కి తగ్గట్లుగా ఆమె ఓంకార్ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారు. షో కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారు. అయితే స్టార్స్ అనే వాళ్ళు షో కోసం కష్టపడితే అప్పుడు మంచి రేటింగ్ వస్తుంది.. మంచి స్పందన దక్కుతుంది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే రమ్యకృష్ణ మరియు శేఖర్ మాస్టర్ లని సాధ్యమైనంత వరకు వాడేసుకుంటున్నాడు. శ్రీముఖి మరియు మోనాలు గజ్జర్ కూడా ఈ షో లో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరితో కూడా సాధ్యమైనంత వరకు షో కోసం పాపులారిటీని తెచ్చే ప్రయత్నంలో ఓంకార్ అన్నయ్య వాడుతున్నాడు.
గతంలో ఆట తరహాలో ఈ షో ని కూడా బాగా పాపులారిటీ చేసి వరుస సీజన్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఓంకార్ భావిస్తున్నాడు. అందుకోసం అల్లు అరవింద్ కూడా ఆయన వెనుక ఉన్నాడు. పెద్ద మొత్తంలో ఈ షో కోసం డబ్బులు పెట్టేందుకు అల్లు అరవింద్ తో పాటు ఇంకా పలువురు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. షో కి ఇప్పటికే మంచి ఆధరణ లభిస్తోంది. అందుకే ఓంకార్ సాధ్యమైనంత ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షించేందుకు కృషి చేస్తున్నాడు. ఓటీటీ ద్వారా వచ్చిన కార్యక్రమాలకు ఈ స్థాయిలో స్పందన దక్కడం ఇదే ప్రథమం అంటూ ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆహా ఓటీటీ ఈ దెబ్బతో మరింతగా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.