Ramya Krishnan : రమ్యకృష్ణ ను ఫుల్‌ గా వాడేస్తున్న ఓంకార్ అన్నయ్య.. సూపర్ సూపర్ సూపర్‌

Ramya Krishnan : ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ కార్యక్రమానికి మంచి స్పందన దక్కుతుంది. అందుకు కారణం ఓంకార్ తనదైన శైలిలో కార్యక్రమాన్ని డిజైన్ చేయడం. అంతే కాకుండా జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న రమ్యకృష్ణ మరియు శేఖర్ మాస్టర్ లను సాధ్యమైనంత వరకు వాడేసుకుంటున్నాడు. ఇటీవల శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకున్న విజువల్స్ చూపించి అందరిని కట్టి పడేసి డాన్స్ ఐకాన్ లో ఏదో జరుగుతుంది అని చెప్పకనే చెప్పే విధంగా ప్రోమో కట్ చేశాడు. ఇప్పుడు రమ్యకృష్ణ ని కూడా సాధ్యమైనంతగా ఉపయోగించుకొని తన షో కి మంచి పాపులారిటీ దక్కేలా ఓంకార్ ప్రయత్నిస్తున్నాడు. రమ్యకృష్ణ విషయంలో ఓంకార్ వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

ఆమె ఒక లేడీ లెజెండ్ అనడంలో సందేహం లేదు, అలాంటి వ్యక్తిని ఉపయోగించుకొని తన కార్యక్రమానికి సాధ్యమైనంత పబ్లిసిటీ తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆమెకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. కనుక ఆ రెమ్యూనరేషన్ కి తగ్గట్లుగా ఆమె ఓంకార్ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారు. షో కోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడుతున్నారు. అయితే స్టార్స్ అనే వాళ్ళు షో కోసం కష్టపడితే అప్పుడు మంచి రేటింగ్ వస్తుంది.. మంచి స్పందన దక్కుతుంది అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అందుకే రమ్యకృష్ణ మరియు శేఖర్ మాస్టర్‌ లని సాధ్యమైనంత వరకు వాడేసుకుంటున్నాడు. శ్రీముఖి మరియు మోనాలు గజ్జర్ కూడా ఈ షో లో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరితో కూడా సాధ్యమైనంత వరకు షో కోసం పాపులారిటీని తెచ్చే ప్రయత్నంలో ఓంకార్ అన్నయ్య వాడుతున్నాడు.

omkar aha ott dance icon judge ramya krishna family help full for show

గతంలో ఆట తరహాలో ఈ షో ని కూడా బాగా పాపులారిటీ చేసి వరుస సీజన్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఓంకార్ భావిస్తున్నాడు. అందుకోసం అల్లు అరవింద్ కూడా ఆయన వెనుక ఉన్నాడు. పెద్ద మొత్తంలో ఈ షో కోసం డబ్బులు పెట్టేందుకు అల్లు అరవింద్ తో పాటు ఇంకా పలువురు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. షో కి ఇప్పటికే మంచి ఆధరణ లభిస్తోంది. అందుకే ఓంకార్ సాధ్యమైనంత ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షించేందుకు కృషి చేస్తున్నాడు. ఓటీటీ ద్వారా వచ్చిన కార్యక్రమాలకు ఈ స్థాయిలో స్పందన దక్కడం ఇదే ప్రథమం అంటూ ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆహా ఓటీటీ ఈ దెబ్బతో మరింతగా తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

4 days ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

4 days ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

4 days ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

4 days ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

4 days ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

5 days ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

5 days ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

5 days ago