Oppenheimer Trailer : ఈ ఒక్క ట్రైలర్ ప్రపంచాన్ని ఊపేస్తోంది ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Oppenheimer Trailer : ఈ ఒక్క ట్రైలర్ ప్రపంచాన్ని ఊపేస్తోంది !

 Authored By sekhar | The Telugu News | Updated on :9 May 2023,12:00 pm

Oppenheimer Trailer : ప్రజెంట్ ప్రపంచ సినీ రంగాన్ని “ఓపెన్ హైమర్” ట్రైలర్ కుదిపేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మాస్టర్ స్టోరీ టెల్లర్స్ లో ప్రఖ్యాతిగాంచిన క్రిస్టఫర్ నోలెన్ ఒకరు. నోలెన్ చివరిగా చేసిన సినిమా “టెనెట్”. ఈ క్రమంలో రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై రెండు అణు బాంబులు పడిన సందర్భాన్ని తీసుకుని లైన్ గా మలచి ఆసక్తికరమైన బయోగ్రాఫ్ సినిమాని “ఓపెన్ హైమర్” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి మొదటి ట్రైలర్ కొన్ని నెలల క్రితం విడుదలయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది.

Oppenheimer Trailer is shaking the world

Oppenheimer Trailer is shaking the world

సినీ ప్రేమికులు ఎంతగానో ప్రశంసల వర్షం కురిపించారు. ట్రైలర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. కాగా ఇప్పుడు మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ మరింత హైప్ నీ క్రియేట్ చేస్తూ వెబ్ మీడియాలో సునామీ సృష్టిస్తుంది. నోలెన్ తీసిన చాలా చిత్రాలు ఆస్కార్ లు కొల్లగొట్టడం సహజం. మరోసారి అలాంటి ప్రయత్నం జరుగుతుందని “ఓపెన్ హైమర్” ట్రైలర్ కి వస్తున్నా రెస్పాన్స్ బట్టి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా జులై 21 వ తారీఖున విడుదల కానుంది.

Oppenheimer Trailer: Cillian Murphy Tries Not to Blow Up the World

నొలెన్ తెరకెక్కించిన అత్యధిక సినిమాలలో సిలియన్ మర్ఫీ తన పాపులర్ సిరీస్ “పిక్కీ బ్లెండర్స్” తో బాగా పేరు తెచ్చుకోవడం జరిగింది. అతడు ఏ సినిమాలో మేధావి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్ హైమర్(టైటిల్) పాత్రను పోషిస్తున్నాడు. చరిత్ర చెబుతున్నట్లు అనుభవం తయారు చేసిన వ్యక్తి అది ఏ స్థాయిలో విధ్వంసం కలిగిస్తుందో ముందే ఊహించగలిగే వ్యక్తి. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 100 మిలియన్ ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి..లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం అందించగా.. జెన్నిఫర్ లేమ్ ఎడిట్ చేశారు.

YouTube video

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది