Pallavi Prashanth : రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచిన మనోడికి మంచి క్రేజ్ దక్కింది. బిగ్ బాస్ హౌస్లో తన ప్రవర్తన, ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. హౌస్ నుండి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ ప్రవర్తన మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. సక్సెస్ కిక్ లో పోలీసుల ఆదేశాలు ఖాతరు చేయకుండా విజయోత్సవ ర్యాలీ చేసి జైలుపాలు అయ్యాడు. ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ అయిన తర్వాత ఇచ్చిన మాట గుర్తుందా? “బిగ్‌బాస్ నుంచి వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతాను.. నాకు వచ్చిన రూ 35 లక్షల్లో నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. ప్రతి రూపాయి రైతులకే పంచేస్తా” అంటూ స్టేజ్ మీద ప్రశాంత్ మాట ఇచ్చాడు.
ఇచ్చిన మాట ప్రకారం రైతులకి డబ్బులు ఇవ్వడం లేదని చాలా మంది నెటిజన్లు ప్రశాంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు . బిగ్ బాస్ సీజన్ 7 ముగిసి ఏడు నెలలు అవుతుంది. ఒక్క లక్ష రూపాయలు మాత్రమే పల్లవి ప్రశాంత్ దానం చేశాడు.మొదటి సహాయం చేసిన నెలలు గడిచిపోగా మరొక పేద రైతును అతడు ఆదుకుంది లేదు. దీంతో పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ విషయంలో మాట తప్పాడు అని ఆయనని దారుణంగా విమర్శిస్తున్నారు.. ఇక డబ్బులు దానం చేసే సూచనలు లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్ వ్యవసాయ పనులు చేయడం కూడా తగ్గించాడు. సోషల్ మీడియాలో వ్యవసాయం చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తున్నా అవి కూడా ప్రచారం కోసమే.
సోషల్ మీడియా ఆదాయం, ఇతర ప్రమోషన్స్ వలన వచ్చే సంపాదనతో హ్యాపీగా బ్రతికేస్తున్నాడట. అయితే పల్లవి ప్రశాంత్ లుక్ మార్చేసి కొత్త లుక్ లో కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొత్త లుక్ లో పల్లవి ప్రశాంత్ బాగున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరైన శుభశ్రీ రాయగురు బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. ఈ వేడుకలో పల్లవి ప్రశాంత్ లుక్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. టోర్న్ జీన్స్, హుడీ జాకెట్ ధరించి అల్ట్రా మోడ్రన్ గా తయారయ్యాడు. రైతుబిడ్డ ట్రాన్స్ఫర్మేషన్ చూసి జనాల మైండ్ బ్లాక్ అవుతుంది.
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
This website uses cookies.