Pan India Star : పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు..ఇప్పుడు గేట్ ముందు వాచ్ మెన్ గా మారాడు
Pan India Star : సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కడం ఒక అదృష్టం. అవకాశాన్ని అందిపుచ్చుకున్న తర్వాత సక్సెస్ ఉన్నంతకాలం వెలుగుల్లో నడవడం సులభం. అయితే అవకాశాలు తగ్గిపోయినప్పుడు ఎదురయ్యే కష్టాలు మాములుగా ఉండవు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. తాజాగా బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పాన్ ఇండియా నటుడు సావి సిద్దు ఇప్పుడు జీవనోపాధి కోసం అపార్ట్మెంట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చి అందర్నీ షాక్ కు గురి చేస్తుంది .
Pan India Star : పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు..ఇప్పుడు గేట్ ముందు వాచ్ మెన్ గా మారాడు
సావి సిద్దు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజిత్ వంటి పెద్ద స్టార్‌లతో కలిసి పనిచేశాడు. అజిత్ నటించిన ‘ఆరంభం’ సినిమాలో ఆయన చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. చివరిసారి 2014లో ‘బేవకూఫియాన్’ సినిమాలో కనిపించిన సావి సిద్దు, ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాల నుంచి దూరమయ్యాడు. అనుకోని విధంగా తన భార్యను కోల్పోయిన దుఃఖం, తర్వాత తల్లిదండ్రుల మృతితో ఆయన తీవ్ర మనోవేదనలోకి వెళ్లిపోయాడు. ఆ మానసిక వేదన కారణంగా సినిమాలపై దృష్టి నిలుపలేకపోయి, ఆర్ధికంగా కష్టాల్లో రావడం తో వాచ్‌మన్ ఉద్యోగం చేస్తున్నాడు.
ప్రస్తుతం సావి సిద్దు మాట్లాడిన హృదయవిదారక వ్యాఖ్యలు నెటిజెన్స్ హృదయాలను తాకాయి. ఓ వెలుగైన సినీ జీవితాన్ని గడిపిన వ్యక్తి ఇలా జీవనోపాధి కోసం పోరాడటం చూసి చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు. సినీ ఇండస్ట్రీలోని ఎన్నో వాస్తవాలను ఈ సంఘటన బయటపెడుతోంది. జీవితం ఎప్పుడెప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేరు.
Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…
Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
Farmers : అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి…
Liver Diseases : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…
10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధులకి అదిరిపోయే శుభవార్త. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…
Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…
This website uses cookies.