ప్రభాస్ లేకుండా మొదలవబోతున్న పాన్ ఇండియన్ సినిమా షూటింగ్ ..?

Authored By vamana sai | The Telugu News | Published on: January 10, 2021, 2:30 pm

ప్రభాస్ లేకుండా భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ మొదలబోతుందా .. అవుననే మాట బీ టౌన్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం కంప్లీట్ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా సంక్రాంతి పండుగ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందబోతోంది. కాగా ఈ సినిమా ని 4 నెలల్లో టాకీపార్ట్ కంప్లీట్ చేసి విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న సలార్ ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. 2020 లో ప్రభాస్ నుంచి ఏ సినిమా రాకపోవడం తో 2021 లో కనీసం రెండు సినిమాలని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే రాధే శ్యాం సమ్మర్ కి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మే నెలలో భారీ స్థాయిలో ప్రభాస్ రాధే శ్యాం రిలీజ్ చేయాలని నిర్మాతలు పక్కాగా డిసైడై ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ల సలార్ కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయబోతున్నారు.

Adipurush': Prabhas joins Om Raut for multilingual 3D action movie |  NewsBytes

అయితే ఈ నెలలోనే సలార్ తో పాటు ప్రభాస్ నటించబోతున్న ఆదిపురుష్ కూడా సెట్స్ మీదకి వెళ్ళబోతోందని తాజా సమాచారం. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నాడు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాగా జనవరి 19 నుంచి ఆదిపురుష్ గ్రీన్ మ్యాట్ స్టూడియోలో షూటింగ్ మొదలవబోతోందట. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనడం లేదని సమాచారం. ఇక ఎక్కువభాగం భారీ గ్రీన్ మ్యాట్ సెట్ లోనే ఆదిపురుష్ షూటింగ్ జరుగుతుందని మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp