Guntur Kaaram : గుంటూరు కారం మూవీ ప్లాప్‌కి కారణం అదే.. ప్రముఖ రచయిత షాకింగ్ కామెంట్స్..!
Guntur Kaaram : మహేష్ బాబు తాజా సినిమా ‘ గుంటూరు కారం ‘ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 13ఏళ్ల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఈ సినిమా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి ఏ మాత్రం సరిపోలేదని, ఈ సినిమాలో చాలా తప్పులు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గుంటూరు కారం పేరే అసలు ఈ సినిమాకి తగ్గది కాదని చాలా సున్నితంగా వివరించారు. గుంటూరు కారం అనగానే ఫుల్ మాస్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారని, అది ఈ సినిమాలో లేదని చెప్పుకొచ్చారు.
అలాగే గుంటూరు వాళ్ళబ్బాయి అన్న టైటిల్ పెడితే చాలా బాగా సెట్ అయ్యేదని, ముఖ్యంగా ప్రేక్షకులందరికీ ఆయన గుంటూరు ఫ్యామిలీకి చెందిన వాడని అర్థం అయి ఉండేదని అన్నారు. అలాగే సినిమాలో చాలా తప్పులు ఉన్నాయని తెలిపారు. ముందుగా మహేష్ బాబు స్టాండర్డ్ ఈ సినిమాలో లేదని ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యానని, సినిమా ఆర్డర్ ప్రేక్షకులకు ఎలా అర్థమైందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఈ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ ఆడుకున్నారని, రెండోసారి ఈ సినిమా చూస్తే ఇంకా బాగా అర్థం అయ్యేది అని వివరించారు. 200 కోట్లతో తీసిన ఈ సినిమాకి 201 కోట్లు వచ్చాయని చెబుతున్నారు. కానీ 300 కోట్లు వస్తేనే ఈ సినిమా వల్ల అందరికీ లాభం జరిగిందని సినిమా వాళ్ళు భావిస్తారని చెప్పుకొచ్చారు. 2022లో రావాల్సిన ఈ సినిమా 2024 లో వచ్చిందని పలు సమస్యల కారణంగా ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పకొచ్చారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేక అద్భుతమైన సినిమాలు తీయగా, ఈ సినిమా మాత్రం ఎందుకో చాలా తేడాగా ఉందని అన్నారు. స్క్రీన్ ప్లే ఎందుకో అర్థం కాకుండా నడిపారు. హీరోతో ఒక చిన్న సంతకం పెట్టించుకునే లైన్ తో వచ్చిన ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ పండించడం చాలా కష్టం అని వివరించారు. అలాగే హీరోను ప్రేమలో పడేసి సంతకం పెట్టించుకోవాలని హీరోయిన్ ను దింపడం బాలేదని, పాజిటివ్ దృక్పథాలు కావని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. మదర్ సెంటిమెంట్ మరింత డెవలప్ చేసుకుంటూ వెళితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని అన్నారు. అలాగే సినిమాలో నెగిటివ్ గా చూపించిన పాత్రలో మార్పులు చూపిస్తే బాగుండేదని, రియలైజేషన్ ఉండి ఉంటూ ఈ సినిమా మరింత రీచ్ చెయ్యదని చెప్పుకొచ్చారు. ఏమైనా మహేష్ బాబు సినిమాకు డబ్బు వచ్చినా హృదయానికి సంతృప్తి రాలేదని అన్నారు. ఇది చెప్పడానికి కష్టంగా ఉన్న ఇదే నిజమని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
This website uses cookies.