Rashmi Gautam : ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా ఉందట.. యాంకర్ రష్మీ పరువుపాయే..!
Rashmi Gautam యాంకర్ రష్మీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రష్మీ గ్లామరే కాదు, సామాజిక అంశాలపై ఆమె స్పందించే తీరును చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో యాంకర్‌గా, డీ షోలో టీమ్ మెంటర్‌గా కొనసాగుతూనే. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తుంది. ఇక, షాప్ ఓపెనింగ్స్, ఇతర ప్రోగ్రామ్స్‌లో గెస్ట్‌గా వెళ్లి కూడా సందడి చేస్తుంటుంది. అయితే తెలుగు అంతా బాగా రాకపోయినా.. యాంకరింగ్‌లో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతుంది ఈ భామ.

patas asia funny comments on anchor Rashmi Gautam
కేవలం యాంకరింగే కాకుండా అప్పుడప్పుడు ఎక్స్‌ట్రా జబర్దస్త్ స్కిట్స్‌లో కూడా సందడి చేస్తుంటుంది రష్మీ. తాజాగా ఓ స్కిట్ కనిపించిన రష్మీపై ఆసియా పంచులు వేసింది. రష్మీకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందంటూ సైటర్స్ వేసింది. అసలేం జరిగిందంటే.. రష్మీ మరి కొందరితో కలిసి కార్తీక మాసపు దీపాలు పెడుతుంది. వాటిని నీటిలో వదిలేసి.. దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక ఆ తరువాత రష్మీకి వరుసగా పంచుల మీద పంచులు పడ్డాయి.
Rashmi Gautam : రష్మీ పరువుతీసిన కమెడియన్

patas asia funny comments on anchor Rashmi Gautam
ఆ సమయంలో ఈ రోజు దీపాలు వెలిగించి ఏది కోరుకున్న అది పూర్తవుతుందని రష్మీ అంటుంది.. పక్కనే ఉన్న ఆసియా.. మరి 8 సంవత్సరాల నుంచి నీ కోరిక ఎందుకు తీరడం లేద అక్క అంటూ కౌంటర్ వేస్తుంది. తర్వాత రష్మీ.. ఈ రోజు గుడి దగ్గర యెధవలు తిరిగుతుంటారు ఎవరికి పడితే వారికి పడిపోకండి అర్థమయిందా..? అని అంటుంది. అప్పుడు ఆసియా.. ఫుల్ ఎక్స్‌పీరియన్స్ మా అక్కకి అంటూ కౌంటర్ వేస్తుంది. దీనిని రష్మీ లైట్ తీసుకున్న జనాలు మాత్రం రష్మీ పరుపుపాయే అంటూ సరదగా కామెంట్స్ చేస్తున్నారు.
